
‘‘వీర చంద్రహాస’ టైటిల్‌తోపాటు ట్రైలర్ కూడా ఆసక్తిగా ఉంది. రవి బస్రూర్ ఇప్పటివరకు తనదైన సంగీతంతో అలరించగా, ఈ సినిమాతో డైరెక్టర్‌గానూ నిరూపించుకున్నారు. ఎమ్‌వీ రాధాకృష్ణగారు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది’’ అని హీరో విశ్వక్ సేన్ చెప్పారు. ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘వీర చంద్రహాస’. శివ రాజ్‌కుమార్ కీలకపాత్రపోషించగా, శిథిల్ శెట్టి, నాగశ్రీ జీఎస్ ప్రధానపాత్రలుపోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 18న కన్నడలో విడుదలై, హిట్‌గా నిలిచింది.
ఈ సినిమాని కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్‌పై ఎమ్‌వీ రాధాకృష్ణ త్వరలో తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను విశ్వక్ సేన్ విడుదల చేశారు. ఎమ్‌వీ రాధాకృష్ణ మాట్లాడుతూ– ‘‘వీర చంద్రహాస’ చిత్రం కన్నడలో హిట్ టాక్ తెచ్చుకోవడంతోపాటు మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘మా సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని భావిస్తున్నాను’’ అని రవి బస్రూర్ తెలిపారు.