breaking news
Trailer Launched
-
పబ్లిసిటీ దాటుతోంది
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పబ్లిసిటీ ట్రెండ్ మారుతోంది. గతంలో సినిమా ఈవెంట్లు కేవలం హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితం అయ్యేవి. సినిమా ప్రారంభోత్సవాలు, షూటింగ్స్, ఆడియో రిలీజ్లు, ప్రెస్మీట్స్, సాంగ్ లాంచ్ ఈవెంట్స్, టీజర్ లాంచ్, ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ప్రెస్మీట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, థ్యాంక్స్ మీట్, సక్సెస్ మీట్... ఇలా సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలన్నీ హైదరాబాద్‌లోనే జరిగేవి. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, థ్యాంక్స్ మీట్, బ్లాక్‌బస్టర్ మీట్స్‌కి అయితే ప్రత్యేకించి ఆయా హీరోల అభిమానులు భాగ్యనగరానికి తరలి వచ్చేవారు. ఇప్పుడూ వస్తున్నారు. అయితే ఇప్పుడు పబ్లిసిటీ ట్రెండ్ చేంజ్ అయింది. సినిమాల ప్రారంభోత్సవాల నుంచి షూటింగ్స్, సాంగ్ లాంచ్ ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ప్రెస్మీట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, థ్యాంక్స్ మీట్స్... ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు తిరుపతి, గుంటూరు, విజయవాడ, వైజాగ్, భీమవరం, రాజమండ్రి, కర్నూలు, అనంతరపురం, వరంగల్... వంటి ప్రాంతాల్లోని ఓపెన్ గ్రౌండ్స్‌తో పాటు థియేటర్స్, కన్వెన్షన్ హాల్స్‌లోనూ జరుగుతున్నాయి. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లలో ఆయా సినిమాల ఈవెంట్లను నిర్వహించడం ద్వారా అక్కడి సినిమా అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై బజ్ పెంచవచ్చన్నది మేకర్స్ ఆలోచన. అదే విధంగా మరికొంత మంది చిత్రయూనిట్స్ అయితే ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యార్థుల సందడి మధ్య టీజర్ లాంచ్, ట్రైలర్ లాంచ్, సాంగ్స్ లాంచ్ ఈవెంట్స్ నిర్వహించడం కూడా ఈ మధ్య ట్రెండ్‌గా మారింది. ఆ విశేషాలు ఏంటో ఓసారి చూద్దాం.భీమవరంలో ఇరుముడి... రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఇరుముడి’. ఈ సినిమాలో ప్రియా భవానీశంకర్ కథానాయికగా నటించగా, బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషించారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెరపాలెం, కార్తీక్ అడుసుమల్లి, మహేశ్ కీలక పాత్రలు పోషించారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మŠస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని ఈ నెల 12న రవితేజ, సినిమా అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో హీరో రవితేజ మాట్లాడుతూ–‘‘హలో భీమవరం... నాకు భీమవరంతో మంచి అనుబంధం ఉంది. నా జీవితంలో దాదాపు ఎనిమిది నెలల పాటు కేవలం సినిమాలు చూడటానికే భీమవరంలో ఉన్నాను. మా తాతయ్య, నానమ్మ డీఎన్ఆర్ కాలేజ్ దగ్గర ఉండేవారు. భీమవరానికి చాలా మంచి వైబ్ ఉంటుంది. మాది భీమవరం అని ఎవరైనా సరే గర్వంగా చెప్పుకుంటారు. ఇక్కడి ఫుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి కోడి పందేల్లో కలుద్దాం. ‘ఇరుముడి’ సినిమా ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా సంతోషంగా ఉంది... సినిమా కూడా మీకు కచ్చితంగా నచ్చుతుంది. ఈ వైబ్‌ను ఇలాగే కంటిన్యూ చేద్దాం. థ్యాంక్యూ భీమవరం’’ అన్నారు. డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ–‘‘అందరికీ నమస్కారం. ‘ఇరుముడి’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ భీమవరంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ మా ట్రైలర్ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్లో ఉన్నదానికి పదింతలు సినిమాలో ఉంటుంది. ‘ఇరుముడి’ టైటిల్ ప్రకటించగానే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అద్భుతమైన వైబ్రేషన్ వచ్చింది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు అదే వైబ్రేషన్, అదే ప్రేమ చూపిస్తున్నారు. మీ ప్రేమ నాపై మరింత బాధ్యతను పెంచింది. ‘ఇరుముడి’ కేవలం ఒక సినిమా కాదు... గొప్ప ఎమోషన్’’ అని చెప్పారు. నిర్మాత వై. రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘ఇరుముడి’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని భీమవరంలో చేద్దామని అనుకున్నప్పుడు రవితేజగారు వెంటనే ఓకే అన్నారు. ‘ఇరుముడి’ సినిమా చాలా పెద్ద రేంజ్‌కి వెళ్తుందని నమ్ముతున్నాం. మీరందరూ థియేటర్లలో ‘ఇరుముడి’ సినిమా చూడాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. తిరుపతిలో లెనిన్ అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘లెనిన్’. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. సునీల్, శివాజీ, బ్రహ్మాజీ ఇతర పాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా జూలై 10న రిలీజ్ అయింది. కాగా ఈ మూవీ ప్రెస్‌మీట్‌ని విశాఖపట్నంలో నిర్వహించారు. అదే విధంగా జూలై 5న ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో, నిర్మాత అక్కినేని నాగార్జున మాట్లాడుతూ– ‘‘ముందుగా కొండమీద ఉన్న వెంకటేశ్వర స్వామికి భక్తపూర్వక నమస్కారం. ఆయన మనందర్నీ చల్లగా చూడాలి. లెనిన్ శ్రీరామపురంలో జరిగే కథ అని డైరెక్టర్ నందు చెప్పారు. నాన్నగారు (అక్కినేని నాగేశ్వరరావు) శ్రీరామపురం అనే ఊర్లోనే పుట్టారు. దీంతో నందు చెప్పిన కథ నాకెంతో నచ్చింది. ఈ సినిమాలోని ప్రతీ పాత్రలో రకరకాల కోణాలున్నాయి. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టుల్ని ఎవ్వరూ ఊహించలేరు. ‘లెనిన్’ ఈ రాయలసీమ కథ... సీమ మట్టి కథ.. సీమలో ఉన్న మనుషుల కథ... సీమలో జరుగుతున్న మహాభారతం. అఖిల్ ఇలాంటి కథకు సూట్ అవుతాడా? అని మొదట్లో చాలా భయపడ్డాను. కానీ, సినిమా చూశాక అందరూ ఆశ్చర్యపోయారు. తెరపై అఖిల్ కనిపించలేదు.. లెనిన్ మాత్రమే కనిపించాడు. లెనిన్ ప్రేమను, పగను ప్రేమిస్తారు.. లెనిన్‌ను ఇంటికి తీసుకువెళ్తారు. మనందరికీ ఆ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ ప్రేక్షక దేవుళ్ల సాక్షిగా చెబుతున్నాను.. మనవాడు (అఖిల్) ‘లెనిన్’తో హిట్ కొడుతున్నాడు’’ అని అన్నారు. అక్కినేని అఖిల్ మాట్లాడుతూ– ‘‘థ్యాంక్యూ తిరుపతి. ఏడు కొండలవాడా.. గోవిందా గోవిందా. రాయలసీమ బిడ్డ అయిన నందు ‘లెనిన్’ లాంటి అద్భుతమైన కథని నాకు చెప్పారు. నా జర్నీ, నా పెయిన్ అంతా కూడా ఈ కథలోనే కనిపించింది. అందుకే నేను వెంటనే ఓకే చెప్పాను’’ అన్నారు. సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ– ‘‘లెనిన్’ కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. అఖిల్‌ను నేనే ఎక్కువ ఇబ్బంది పెట్టాను. అఖిల్ ఈసారి ఏ ఒక్కర్నీ కూడా నిరాశపరచడు. ఇంటర్వెల్, చివరి 40 నిమిషాలు మాత్రం ఆడియన్స్ షాక్ అయ్యేలా ఉంటుంది. రెగ్యులర్ ఫార్మాట్‌లా మాత్రం అస్సలు ఉండదు. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది’’ అన్నారు. భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ– ‘‘హాయ్ తిరుపతి. ఎలా ఉన్నారు. మీ అందరికీ ట్రైలర్ నచ్చిందా?. ‘లెనిన్’లో నేను భారతి అనే పాత్ర చేశాను. ఇలాంటి గొప్ప పాత్రను నాకు ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్. నా కెరీర్లో భారతి పాత్ర నిలిచిపోతుంది’’ అన్నారు. అనంతపురంలో కొరియన్ కనకరాజు... వరుణ్ తేజ్, రితికా నాయక్ జోడీగా నటించిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సునీల్, సత్య, తులసి, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న (శుక్రవారం) విడుదలైంది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘రాసా గుమ్మాడి...’ అంటూ సాగే సెకండ్ సాంగ్‌ని జూలై 19న (ఆదివారం) అనంతపురంలో అభిమానుల సమక్షంలో విడుదల చేశారు. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, నల్గొండ గద్దర్ పాడారు.‘రాసా గుమ్మాడి...’ సాంగ్ లాంచ్ ఈవెంట్లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘కొరియన్ కనకరాజు’ చిత్రీకరణ అనంతపురంలోనే జరిగింది. ఇక్కడి కియా కార్ల ఫ్యాక్టరీలోనూ షూటింగ్ చేశాం. అందుకే ‘రాసా గుమ్మాడి...’ పాటను ఇక్కడే రిలీజ్ చేయాలనుకున్నాం. అభిమానుల సమక్షంలో ఇలా పాటను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. మేర్లపాక గాంధీ మాట్లాడుతూ– ‘‘కొరియన్ కనకరాజు’లోని ‘రాసా గుమ్మాడి...’ పాటను అనంతపూరంలో రిలీజ్ చేయాలని వరుణ్‌గారు చెప్పారు. ఇక్కడి బ్యాక్ డ్రాప్‌తోనే ఈ మూవీ చేశాం’’ అన్నారు.విశాఖపట్నంలో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్.. ‘కొరియన్ కనకరాజు మెగా బాక్సాఫీసు బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్’ ని ఈ నెల 14న(శుక్రవారం) విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘అందరికీ నమస్కారం. వైజాగ్‌లో ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వైజాగ్‌తో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. సత్యానంద్‌గారి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో నటనలో శిక్షణ తీసుకున్నాను. ఈ వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన మెగా ఫ్యాన్స్‌కి, ప్రేక్షకులకు థ్యాంక్స్. మీ అందరికీ మంచి సినిమాలు ఇవ్వాలనే ప్రయత్నంలోనే ఉంటాను. మంచి స్క్రిప్ట్ కుదిరితే ‘కొరియన్ కనకరాజు’ సినిమాకు కొనసాగింపుగా మరో సినిమా చేయడానికి ప్రయత్నిస్తాం’’ అని తెలిపారు. నటుడు సత్య మాట్లాడుతూ–‘‘నేను యాక్టర్ అవ్వాలనే నిర్ణయం వైజాగ్‌లోనే తీసుకున్నాను. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన గాంధీగారికి థ్యాంక్యూ’’ అన్నారు. హన్మకొండలో నేను రెడీ హవీష్, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం ‘నేను రెడీ’. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించిన ఈ మూవీలో నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్ చేశారు. బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, గోపరాజు రమణ, హరితేజ, మహతి, రూపా లక్ష్మి, జయవాణి, మాణిక్ రెడ్డి, సత్యనారాయణ, రోహన్ రాయ్ ఇతర పాత్రలు పోషించారు. హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పీపై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మించిన ఈ మూవీ విడుదలకు ముస్తాబవుతోంది. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘మస్తుగుందిరో యవ్వారం...’ అంటూ సాగే మూడో పాట విడుదల వేడుకని ఈ నెల 13న (గురువారం) హన్మకొండలో నిర్వహించారు. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి, మనీషా ఎరబత్తిని పాడారు. విజయ్ పోలాకి కొరియోగ్రఫీ అందించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ఈ పాటని విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘మస్తుగుందిరో యవ్వారం...’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ని హన్మకొండలో నిర్వహించడం ఆనందంగా ఉంది. ఈ చిత్రంలోని పాటలన్నీ అందరికీ నచ్చేలా ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా హన్మకొండలో చేయాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. హీరో హవీష్ మాట్లాడుతూ– ‘‘హలో వరంగల్. మీరు ఇచ్చిన ఆదరణ మాకు గొప్ప కిక్ ఇచ్చింది. ఈ కిక్ కోసం మళ్లీ మళ్లీ ఇక్కడికి వస్తాం. మా పాటలన్నీ మీకు నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ వేడుకలో మీ రియాక్షన్ చూస్తుంటే సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని ముందే అర్థమవుతోంది. తప్పకుండా ఈ సినిమాని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన మాట్లాడుతూ– ‘‘హాయ్ హన్మకొండ... ఈ సాంగ్‌ను పెద్ద హిట్ చేసిన ఆడియన్స్‌కి థ్యాంక్యూ. ‘నేను రెడీ’ని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలి’’ అన్నారు. కావ్యా థాపర్ మాట్లాడుతూ– ‘‘ఈ వేడుకకి వచ్చిన అందరికీ థ్యాంక్యూ. ఈ సినిమాలోని పాటలన్నింటినీ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు’’ అని పేర్కొన్నారు. పైన పేర్కొన్న సినిమాల ఈవెంట్స్ మాత్రమే కాదు... మరికొన్ని సినిమాల కార్యక్రమాలు కూడా ఇతర ప్రాంతాల్లో జరుపుకున్నాయి. పాన్ ఇండియా ఒరవడి అన్ని భాషల సినిమాలూ అన్ని ప్రాంతాలకు వెళుతున్నాయి కాబట్టి పబ్లి‘సిటీ’ దాటుతోంది’ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.కేవలం తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని సినిమాలే కాదు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న కన్నడ, తమిళ్, మలయాళ, బాలీవుడ్ చిత్రాల ప్రమోషన్స్ ఈవెంట్స్‌ని కూడా భారీ ఎత్తున ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలై 18న న్యూఢిల్లీలో ‘రామాయణ’ మూవీ ‘ప్రథమ్ సంకల్ప్’ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు. హిందీ చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రామాయణ’. ఈ సినిమాలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్, లక్ష్మణుడి పాత్రలో రవి దూబే, దశరథ మహారాజుగా రామానంద్ సాగర్, కైకేయి పాత్రలో శోభన, విశ్వామిత్ర మహర్షిగా అజింక్య దేవ్, ఇంద్రుడిగా కునాల్ కపూర్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో డీఎన్ఈజీ, యశ్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్న ‘రామాయణ: పార్ట్ 1’ ప్రపంచవ్యాప్తంగా ఈ దీపావళికి విడుదల కానుంది. ఈ చిత్రాన్ని అంతర్జాతీయంగా సోనీ పిక్చర్స్, ఉత్తర భారతదేశంలో ధర్మ ప్రొడక్షన్స్ విడుదల చేయనున్నాయి. ఇదిలా ఉంటే... ఈ మూవీ హిందీలో తెరకెక్కినప్పటికీ తొలి ప్రమోషన్ ఈవెంట్‌ని ముంబైలో కాకుండా న్యూఢిల్లీలో చేపట్టడం విశేషం. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ట్రైలర్ విడుదలకు ముందు న్యూఢిల్లీలో ‘ప్రథమ్ సంకల్ప్’ పేరుతో ఓ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో నిర్మాత, క్రియేటివ్ ఆర్కిటెక్ట్ నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ–‘‘ రామాయణం కేవలం మన గొప్ప ఇతిహాసాల్లో ఒకటి మాత్రమే కాదు... అది మన జీవన విధానంలో భాగం. మనం ఎలా జీవించాలి? ఎలా పండగలు జరుపుకోవాలి? మన విలువలను తదుపరి తరాలకు ఎలా అందించాలి అనే విషయాలను నేర్పుతుంది’’ అని తెలిపారు. దర్శకుడు నితీష్ తివారీ మాట్లాడుతూ– ‘‘ప్రపంచంలో చెప్పబడిన గొప్ప కథల్లో రామాయణం ఒకటి. దాని గొప్పతనం పరిమాణంలో కాదు... అది ప్రతిబింబించే శాశ్వత విలువల్లో ఉంది. రామాయణాన్ని సంపూర్ణ నిజాయితీతో, ప్రామాణికతతో, అత్యంత గౌరవంతో తెరపై ఆవిష్కరించడం నా బాధ్యతగా భావించాను.ఈ అద్భుతమైన వారసత్వానికి తగిన గౌరవాన్ని ఇస్తూనే, అత్యున్నత సినీ నైపుణ్యంతో ప్రేక్షకులకు అందించాలని ప్రయత్నించాం. ఈ విజన్‌ను సాకారం చేయడానికి ప్రపంచంలోని అత్యుత్తమ కళాకారులు, సాంకేతిక నిపుణులు, కథకులతో కలిసి పని చేయడం నా జీవితంలో ఒక గొప్ప అనుభవం. ప్రేక్షకులు ఈ సినిమాలో కేవలం విజువల్ స్పెక్టకిల్ మాత్రమే కాకుండా, రామాయణంలోని భావోద్వేగం, మానవత్వం, వేల ఏళ్లుగా దాన్ని చిరస్థాయిగా నిలబెట్టిన ఆత్మను కూడా అనుభూతి చెందుతారని ఆశిస్తున్నాను’’ అని చెప్పారు. – డేరంగుల జగన్ మోహన్ -
వడ్డే నవీన్ 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు' మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
వీర చంద్రహాస రెడీ
‘‘వీర చంద్రహాస’ టైటిల్‌తోపాటు ట్రైలర్ కూడా ఆసక్తిగా ఉంది. రవి బస్రూర్ ఇప్పటివరకు తనదైన సంగీతంతో అలరించగా, ఈ సినిమాతో డైరెక్టర్‌గానూ నిరూపించుకున్నారు. ఎమ్వీ రాధాకృష్ణగారు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది’’ అని హీరో విశ్వక్ సేన్ చెప్పారు. ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘వీర చంద్రహాస’. శివ రాజ్‌కుమార్ కీలకపాత్రపోషించగా, శిథిల్ శెట్టి, నాగశ్రీ జీఎస్ ప్రధానపాత్రలుపోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 18న కన్నడలో విడుదలై, హిట్‌గా నిలిచింది.ఈ సినిమాని కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్‌పై ఎమ్వీ రాధాకృష్ణ త్వరలో తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను విశ్వక్ సేన్ విడుదల చేశారు. ఎమ్వీ రాధాకృష్ణ మాట్లాడుతూ– ‘‘వీర చంద్రహాస’ చిత్రం కన్నడలో హిట్ టాక్ తెచ్చుకోవడంతోపాటు మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘మా సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని భావిస్తున్నాను’’ అని రవి బస్రూర్ తెలిపారు. -
రామాపురంలో సీతారాముల కథ
రాజేశ్ కొంచాడ, శ్రావణి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన వింటేజ్ విలేజ్ ఎమోషనల్ లవ్ డ్రామా ‘కౌసల్య తనయ రాఘవ’(Kausalya Thanaya Raghava). స్వామి పట్నాయక్ దర్శకత్వంలో ఏఆర్ మూవీ మేకర్స్ పతాకంపై అడపా రత్నాకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.‘‘ఈ నాటి ప్రసారంలో... రామాపురంలో సీతారాముల కథ..’, ‘ఈ సీత ప్రేమలో రాముడి పడితే..’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ‘‘ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ మంచి పేరు వస్తుంది’’ అని ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రాజేశ్ అన్నారు. ‘‘మా సినిమాను థియేటర్స్‌లో చూసి, సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం’’ అన్నారు స్వామి పట్నాయక్, రత్నాకర్. -
ఆర్మీ నేపథ్యంలో...
భరత్ చౌదరి, ప్రియాంక నాంది జంటగా జె. మోహన్ కాంత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిషన్ 007’. మహంకాళీ పిక్చర్స్ పతాకంపై మహంకాళీ నాగ మహేశ్ నిర్మించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌లో మోహన్ కాంత్ మాట్లాడుతూ–‘‘యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన చిత్రం ‘మిషన్ 007’. మా నిర్మాత నాగమహేశ్గారికి ఇది తొలి సినిమా. బడ్జెట్ చెప్పిన దానికన్నా ఎక్కువ అయినా ఎక్కడా రాజీ పడలేదు.. అందరికీ నచ్చే మూవీ ఇది’’ అన్నారు. నాగమహేశ్ మాట్లాడుతూ– ‘‘యూనిట్ మొత్తం తమ సొంత సినిమాలా భావించి పనిచేశారు.మా చిత్రం కచ్చితంగా ప్రేక్షకుల్ని థ్రిల్‌కు గురి చేస్తుంది. మాకు అన్ని విధాలా సహకరించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు’’ అని చెప్పారు. ‘‘మోహన్ గారు కథ చెప్పినప్పుడు ఆర్మీ నేపథ్యం అనగానే భయం వేసింది. కానీ, ఆయన నమ్మకం చూసి ధైర్యంగా నటించాను’’ అన్నారు భరత్ చౌదరి. ‘‘వాణిజ్య అంశాలతో పాటు దేశభక్తి కూడా ఉండటం మా సినిమాకు గర్వకారణం. నాకు అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు ప్రియాంక నాంది. -
ఎమోషనల్ రైడ్
‘‘రోటి కపడా రొమాన్స్’ ట్రైలర్ బాగుంది. యూత్‌కి ఏదో కొత్తగా చెప్పాలనే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. ప్రతి సంవత్సరం యంగ్ జనరేషన్ చేసిన సినిమా సెన్సేషన్ హిట్ అవుతుంది. ఈ సినిమా కూడా ఆ కోవలో చేరాలని కోరుకుంటున్నాను. న్యూ టాలెంట్‌ని ప్రోత్సహిస్తూ సినిమాలు నిర్మిస్తున్న బెక్కెం వేణుగోపాల్‌లాంటి నిర్మాతలు సక్సెస్ అవ్వాలి’’ అని హీరో నాని అన్నారు. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం నిర్మించిన ఈ చిత్రం నవంబరు 22న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో నానీతో ట్రైలర్ రిలీజ్ చేయించారు. ‘‘యువతరానికి నచ్చే అంశాలకు కుటుంబ భావోద్వేగాలను మేళవించి ఎమోషనల్ రైడ్ మూవీలా రూపొందించాం’’ అని నిర్మాతలు తెలిపారు. -
Mr. Idiot: మూవీ ట్రైలర్ లాంచ్
-
'అవసరం తీరాక ఎంత డబ్బు సంపాదించినా చిత్తు కాగితమే నాన్న'.. ఆసక్తిగా ట్రైలర్
సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నటించిన చిత్రం 'అన్నీ మంచి శకునములే'. ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. (ఇది చదవండి: గోపీచంద్ 'రామబాణం'.. ఆ డిలీటెడ్ సీన్స్ మీరు చూశారా?) ట్రైలర్ చూస్తే ఫుల్ ఫ్యామీలీ ఓరియంటెడ్ చిత్రంగా కనిపిస్తోంది. పిల్లల, తల్లిదండ్రుల మధ్య ఎమోషన్స్ ప్రధానంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఎమోషన్స్‌తో కామెడీ సీన్స్ కూడా నవ్వులు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, నరేశ్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. (ఇది చదవండి: రూమ్‌కు రమ్మని రెండు సార్లు పిలిచాడు: నిర్మాతపై నటి సంచలన ఆరోపణలు) -
‘రామబాణం’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఫోటో గ్యాలరీ
-
'హైవే'మూవీ ట్రైలర్ లాంచ్ వేడుక (ఫోటోలు)
-
అమ్మాయి లైఫ్ సేవ్ చేయాలంటున్న ఆనంద్ దేవరకొండ
Anand Deverakonda HighWay Trailer Released By Naga Shaurya: 'దొరసాని' సినిమాతో తెలుగు వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ 'మిడిల్ క్లాస్ మెలోడీస్'తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆనంద్ దేవరకొండ. అనంతరం వచ్చిన 'పుష్పక విమానం' చిత్రంతో పర్వాలేదనిపించుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. అయితే ఈసారి థియేటర్లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారా రానున్నాడు ఆనంద్ దేవరకొండ. ఇందులో ఆనంద్ దేవరకొండకు జోడీగా మానస అలరించనుండగా, అభిషేక్ బెనర్జీ కీలక పాత్ర పోషించారు. కె.వి గుహన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా నిర్మించింది. ఈ సినిమా ఆగస్టు 19న నేరుగా ఆహాలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మంగళవారం (ఆగస్టు 16) మూవీ ట్రైలర్‌ను హీరో నాగశౌర్య విడుదల చేశాడు. 'నగరంలో వరుస హత్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న సైకో కిల్లర్' అనే న్యూస్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యతం ఉత్కంఠంగా సాగింది. చదవండి: నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ Get ready for this spine chilling thriller. #HighwayOnAHA Premieres August 19. ▶️https://t.co/aDUgzFE7Mf@ananddeverkonda @SaiyamiKher @nowitsabhi @kvguhan @simonkking #VenkatTalari pic.twitter.com/rWPm0EKRJE — ahavideoin (@ahavideoIN) August 16, 2022 'ఒక అమ్మాయి లైఫ్ సేవ్ చేసేందుకే నీ హెల్ప్ కావాల్సి వచ్చింది', 'మనతో గడుపుతుంది ఈ కొన్ని గంటలైన, తను నన్ను జీవితాంతం మర్చిపోకుడదురా' వంటి డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇందులో ఆనంద్ దేవరకొండ లుక్ కొత్తగా ఉంది. ఫొటోగ్రాఫర్ అయిన హీరో ప్రేమలో పడుతాడు. సాఫీగా సాగుతున్న అతని ప్రేమ కథలోకి ఓ సీరియల్ సైకో కిల్లర్ ఎంట్రీతో ఎలాంటి మలుపు తిరిగింది? అనే కథతో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. చదవండి: బిగ్‌బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ -
డైరెక్టర్ క్రిష్ వదిలిన 'టాక్సీ'.. ఆసక్తిగా ట్రైలర్
Director Krish Launched Taxi Movie Trailer: 'కర్త కర్మ క్రియ' సినిమాతో తెలుగు హీరోగా పరిచయం అయ్యాడు వసంత్ సమీర్ పిన్నమరాజు. వసంత్ హీరోగా హెచ్ అండ్ హెచ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై హరిత సజ్జా నిర్మిస్తున్న థ్రిల్లర్ చిత్రం 'టాక్సీ'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద డైరెక్షన్ విభాగంలో పనిచేసిన హరీశ్ సజ్జా ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అల్మాస్ మోటీవాల, సూర్య శ్రీనివాస్, సౌమ్యా మీనన్, ప్రవీణ్ యండమూరి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మార్క్ రాబిన్ సంగీతం అందించిన ఈ సినిమాకు బిక్కీ విజయ్ కుమార్ నిర్మాత. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ ప్రచార చిత్రాన్ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. 1 నిమిషం 59 సెకన్ల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంత ఇంటెన్స్‌గా ఆకట్టుకుంది. కాలిఫోర్నియమ్ 252 అనే అరుదైన హ్యూమన్ మేడ్ మెటల్ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉన్నట్లు తెలుస్తోంది. డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. చదవండి: ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్‌ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ? -
ప్రతి ఒక్కరు మా సినిమా చూసి థ్రిల్ ఫీల్ అవుతారు: హీరో ధృవ
మిస్టరీ నేపథ్యంలో థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన సినిమా కిరోసిన్. పెళ్లి చూపులు, ఘాజీ, టెర్రర్, చెక్, చైతన్యం వంటి సినిమాలతో తన నటన అందరిని ఆకట్టుకున్న ధృవ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ఈ సినిమాను బగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ లు నిర్మించారు. తాజాగా ఈ సినిమా కు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. ఇక జాన్ 17న ఈ సినిమాగా గ్రాండ్ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో తాజాగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలున్న సినిమాలకు మంచి ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు ధృవ మాట్లాడుతూ.. ‘కిరోసిన్ సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది. నేను గతంలో పోషించిన పాత్రల కంటే ఇది విభిన్నంగా ఉంటుంది. నా దర్శకత్వంలో రాబోందుతున్న సినిమా కావడం, అందులో నేనే హీరోగా ఉండడం ఎంతో సంతోషాన్నిస్తుంది. ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన సినీ ప్రముఖులు అందరూ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. తప్పకుండా అందరూ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారు. ప్రేక్షకులు కోరుకునే థ్రిల్లింగ్ అంశాలు చాలా ఉన్నాయి. జూన్ 17వ తేదీన థియేటర్లలోకి వస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడండి’ అని అన్నారు. -
నాన్న నాకు ఏ క్లాస్‌లో పెళ్లి చేస్తావ్.. ఆకట్టుకుంటున్న ట్రైలర్
KTR Launched Kiran Abbavaram Sammathame Trailer: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. 'ఎస్ఆర్ కల్యాణమండపం' సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరో ఇటీవలె 'సెబాస్టియన్ పీసీ 524' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీలా పడిపోయింది. తాజాగా 'సమ్మతమే' సినిమాతో ప్రేక్షకులకు అలరించేందుకు రెడీ అయ్యాడు. ఇందులో హీరోయిన్గా 'కలర్ ఫొటో' ఫేమ్ చాందినీ చౌదరి నటిస్తోంది. గోపీనాథ్ రెడ్డి దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ మూవీ జూన్ 24న విడుదల కానుంది. మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఇప్పటికే రిలీజైన టీజర్ యూత్‌ను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి విడుదల చేశారు. 'ఏ ఇంటికైనా ఆడపిల్లే మహాలక్ష్మీ. వాళ్లు లేని ఇళ్లు ఇలాగే ఉంటుంది' అనే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం కామెడీతో ఆకట్టుకునేలా ఉంది. పెళ్లి, అమ్మాయి కోసం ఎదురుచూసే ఓ యువకుడి కథగా 'సమ్మతమే' సినిమా అని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. 'చెప్పు నాకు ఏ క్లాస్‌లో పెళ్లి చేస్తావ్', 'ఇన్నాళ్లు గోల్డ్ చైన్ వేసుకున్నందుకు ఇన్నాళ్లకు వచ్చిందిరా గోల్డెన్ ఆపర్చునిటీ', 'నీకు ఏ అమ్మాయి కరెక్ట్ కాదు. అద్దంలో మొహం చూసుకుని బొట్టు పెట్టుకుని తాళి కట్టుకో.' అంటూ చెప్పై చాలా డైలాగ్‌లు సూపర్బ్‌గా ఉన్నాయి. శేఖర్ చంద్ర బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది. చదవండి: చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్నుమూత 13 ఏళ్ల పిల్లల నుంచి అత్యాచార బెదిరింపులు, తట్టుకోలేకపోయాను: నటి Gold chain vesukunanduku innalaki vachindi golden opportunity ☺️https://t.co/3BL4z6bCZe Thank you @KTRTRS gaaru for launching ☺️#Sammathame #SammathameFromJune24th pic.twitter.com/U6OuGj5g4f — Kiran Abbavaram (@Kiran_Abbavaram) June 16, 2022 -
'మిషన్ ఇంపాజిబుల్' కోసం 'ఆర్ఆర్ఆర్', 'కేజీయఫ్' సందడి..
Tapsee Mishan Impossible Trailer Released By Mahesh Babu: బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది తాప్సీ. చాలా కాలం తర్వాత తాప్సీ చేస్తున్న తెలుగు సినిమా మిషన్ ఇంపాజిబుల్. ఈ చిత్రానికి 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేం స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్లు ఇటీవల ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు మేకర్స్. తాజాగా మంగళవారం (మార్చి 15) మిషన్ ఇంపాజిబుల్ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఇందులో ఆద్యంతం నవ్వులు పూయిస్తున్న ఈ ట్రైలర్లో తాప్సీ ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్లో మాఫీయ డాన్ దావుద్ ఇబ్రహీంను పట్టుకునేందుకు ముగ్గురు చిన్నారులు ఏం చేశారనేది ఆసక్తిగా ఉంది. 'దావుద్ ఇబ్రహీంను పట్టుకుంటే రూ. 50 లక్షలు ఇస్తారట, వాటిని తీసుకెళ్లి రాజమౌలికి ఇస్తే బాహుబలి పార్ట్ 3 తీస్తాడు' అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇందులో కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి కీలక పాత్రలో నటించాడు. అతడి దగ్గరికి వెళ్లిన ఈ చిన్నారులను 'మీ పేరేంటి అని రిషబ్ అడగ్గా.. 'రఘుపతి.. రాఘవ.. రాజారామ్..' 'ఆర్ఆర్ఆర్' అని సమాధానం ఇస్తారు. తర్వాత ఆ చిన్నారులు తిరిగి మీ పేర్లేంటీ అని అడిగిన ప్రశ్నకు రిషబ్ శెట్టి.. 'ఖలీల్.. జిలానీ.. ఫారూక్' 'కేజీయఫ్' అని చెప్పడం నవ్వు తెప్పిస్తోంది. -
పుష్ప మూవీ అప్డేట్: పుష్ప ట్రైలర్ వచ్చేసింది
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ఫస్ట్‌లుక్, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇందులో బన్నీ పుష్పరాజ్‌గా మాస్ లుక్‌లో అలరించబోతుండగా అతడికి లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్ 1.. పుష్ప ది రైజ్ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన మేకర్స్ నేడు పుష్ప టైటిల్‌ను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కానీ చెప్పిన సమయాని కంటే కొంత ఆలస్యంగా పుష్ప ది రైజ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. -
‘బ్యాక్ డోర్' కచ్చితంగా విజయం సాధిస్తుంది: కె.రాఘవేంద్రరావు
పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'బ్యాక్ డోర్'. కర్రి బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని లెజండరీ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బ్యాక్ డోర్" టీజర్ కి పది మిలియన్ వ్యూస్ వచ్చాయని విన్నాను. ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. దీనికి కచ్చితంగా రెట్టింపు వ్యూస్ వస్తాయి. టీమ్ కి ఆల్ ది బెస్ట్’అన్నారు. రాఘవేంద్రరావు తమ చిత్రం ట్రైలర్ లాంచ్ చేసి, బెస్ట్ విషెస్ చెప్పడం పట్ల దర్శకుడు కర్రి బాలాజీ, హీరో తేజ త్రిపురాన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, అంబికా రాజా ప్రత్యేక అతిధిలుగా పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రానికి కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ, సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్. -
Kapata Nataka Sutradhari: 99 కోట్ల బంగారం కొట్టేశారు, తర్వాత?
వెరైటీ కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రం 'కపటనాటక సూత్రధారి'. విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్,మేక రామకృష్ణ,విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మనీష్ (హలీమ్) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు క్రాంతి సైన దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయి, ఫస్ట్ కాపీ సిద్దంగా ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ నిర్మాత సి అశ్వినీదత్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అశ్వినీదత్ మాట్లాడుతూ... ఈరోజుల్లో సినిమా పరిశ్రమకు చాలామంది కొత్త దర్శకులు, నిర్మాతలు వస్తున్నారు. వారు కంప్యూటర్ టెక్నాలజీ విషయంలో అన్ని నేర్చుకుని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. కపట నాటక సూత్రదారి ట్రైలర్ చాలా కొత్తగా ఉంది. ఈ చిత్రాన్ని క్రాంతి అద్భుతంగా తెరకెక్కించాడు. ముఖ్యంగా మనీష్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. తప్పకుండా వీరు చేసిన ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, అందరికి అల్ ది బెస్ట్ అన్నారు. నిర్మాత మనీష్ మాట్లాడుతూ...మా కపట నాటక సూత్రదారి సినిమా ట్రైలర్‌ని ప్రముఖ సీనియర్ నిర్మాత అశ్వినీదత్ విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. నిర్మాతగా ఆయనే మాకు స్ఫూర్తి, మా దర్శకుడు క్రాంతి సినిమాను చాలా కొత్తగా ఆవిష్కరించాడు. ఇక సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయి ఫస్ట్ కాపీ సిద్దంగా ఉంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. అత్యంత ఉత్కంఠ భరితంగా, క్యూరియాసిటీని పెంచేవిధంగా ఉంది. శ్రమ బ్యాంక్ సిబ్బంది తమ బ్యాంక్‌లోదాచుకున్న రూ.99 కోట్ల విలువ గల బంగారాన్ని దొంగిలించారు. దీంతో వేలాది మంది రోడ్డున పడ్డారు. ఈ కేసును పోలీసులు ఎలా చేధించారనేదే మిగతా కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతంది. -
స్నేహితుడికి అండగా మహేష్.. ట్రైలర్ రిలీజ్
కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న అల్లరి నరేష్ ప్రస్తుతం ‘నాంది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ప్రయోగాత్మక చిత్రాలతో ఆకట్టుకునే నరేష్ ఇపుడు ‘నాంది’ డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. ఈ సినిమాలో క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు సామాజిక అంశాలపై మంచి సందేశం ఇచ్చే విధంగా ఉంటుందని తెలుస్తోంది. నరేష్ గతంలో ‘నేను, గమ్యం’ లాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేసి ఉండటంతో ఈ సినిమా కూడ ఆ తరహాలోనే వాస్తవికతకు దగ్గరగా ఉంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఫిబ్రవరి 19న నాంది ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సతీశ్ వేగేశ్న నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ లాయర్‌గా కనిపించనున్నారు. చదవండి: ‘బంగారు బుల్లోడు’ మూవీ రివ్యూ తాజాగా నాంది సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. సినిమా ట్రైలర్‌ను శనివారం 10. 08 నిమిషాలకు సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. ఈ మేరకు ట్విటర్లో ‘నాంది ట్రైలర్ రిలీజ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని, సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాలని అల్లరి నరేష్, చిత్రయూనిట్‌కు విషెస్ తెలియజేశారు. ఇక ట్రైలర్లో.. ‘రాజగోపాల్ గారిని నేను మర్డర్ చేయడం ఏంటి సార్.. ఇప్పటి వరకు రాజగోపాల్ గారి గురించి వినడం తప్ప ఆయన గురించి నాకేం తెలియదు సార్ అంటూ నరేష్ చెప్పే డైలాగుతో ప్రారంభమైన ట్రైలర్ ఉత్కంఠగా కొనసాగింది. అసలు రాజగోపాల్‌ను నరేష్ హత్య చేశాడా లేక కావాలని అతన్ని ఇరికించారా, నరేష్‌కు రాజగోపాల్‌కు సంబంధం ఏంటి.. ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి ఉండాల్సిందే. చదవండి: ‘రాధే శ్యామ్’ బిగ్ అనౌన్స్మెంట్ : టీజర్ ఆరోజే.. Happy to unveil the trailer of #Naandhi!! Looks intense... Wishing @allarinaresh and the entire team a blockbuster success. 😊@vijaykkrishna @varusarath5 @SV2Enthttps://t.co/0NI8Aa51Hk — Mahesh Babu (@urstrulyMahesh) February 6, 2021 కాగా మహేష్ అల్లరి నరేష్ కలిసి ‘మహర్షి’లో కలిసి నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో వీళ్లిద్దరూ కాలేజీ మిత్రులుగా నటించారు. ఇక ఆ సినిమా సమయంలో ఇద్దరి మధ్యా మంచి సాన్నిహిత్యం, స్నేహం ఏర్పడ్డాయి. అందులో భాగంగానే మహేష్ బాబు నరేష్ నాంది సినిమా ట్రైలర్‌ను విడుదల చేశాడు. మరోవైపు ఎన్నో ఏళ్లుగా హిట్ కోసం ఎంతో ఎదురు చూస్తున్న నరేష్ ఈ సినిమాతోనేనై విజయం సాధిస్తాడో లేదో వేచి చూడాలి. ఇదిలా ఉండగా మహేష్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాడు. సర్కారు వారి పాట షూటింగ్లో బిజీగా ఉన్నాడు. పరుశురామ్ దర్శకుడు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. -
అమ్మ దీవెన
ఆమని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అమ్మదీవెన’. శివ ఏటూరి దర్శకత్వంలో లక్ష్మీ సమర్పణలో ఎత్తరి మారయ్య, చిన మారయ్య, గురవయ్య నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను జీవితా రాజశేఖర్ విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆమని మాట్లాడుతూ– ‘‘మగదిక్కు లేని కుటుంబంలో ఓ స్త్రీ ఐదుమంది పిల్లలని ఎలా చదివించింది? వారి భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దింది? అనే కథతో వస్తున్న మా సినిమాని సపోర్ట్ చేస్తున్న జీవితగారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఆమనిగారి కెరీర్లో మైలురాయిలా నిలిచే సినిమా అవుతుంది’’ అన్నారు నిర్మాతలు. ‘‘మంచి సినిమా నిర్మించాలని నిర్మాతలు రాజీపడలేదు’’ అన్నారు శివ ఏటూరి. -
రణస్థలం హిట్ అవ్వాలి – పూరి జగన్నాథ్
‘‘ఆది అసిస్టెంట్ డైరెక్టర్‌గా నా వద్ద చాలా సంవత్సరాలు పని చేశాడు. ఇప్పుడు తను దర్శకునిగా ‘రణస్థలం’ సినిమా చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. టీమ్‌కి అల్ ద బెస్ట్’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. రాజ్, షాలు జంటగా ఆది అరవల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణస్థలం’. సంతోష ఆంజనేయులు సమర్పణలో శ్రీలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కావలి రాజు నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను పూరి జగన్నాథ్ విడుదల చేశారు. ఆది అరవల మాట్లాడుతూ– ‘‘పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. ప్రేమకథ కూడా ఉంటుంది. మా గురువు పూరి జగన్నాథ్‌గారి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘కెమెరామన్ ప్రభాకర్, సంగీత దర్శకుడు రాజకిరణ్ చక్కటి అవుట్‌పుట్ ఇచ్చారు. మా చిత్రాన్ని నవంబర్ ఆఖరులో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు కావలి రాజు. -
అదరగొట్టిన ‘మల్లేశం’
హైదరాబాద్: నేత కార్మికుల కథ ప్రధానాంశంగా రూపొందిన చిత్రం ‘మల్లేశం’. పద్మశ్రీ అవార్డుగ్రహీత చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కించారు. నేత కార్మికుల కోసం చింతకింది మల్లేశం చేసిన సేవల చుట్టూ ఈ సినిమా ఉంటుంది. ‘పెళ్లిచూపులు’ ఫేమ్ ప్రియదర్శి టైటిల్ రోల్ చేశారు. రాజ్. ఆర్ దర్శకత్వంలో రాజ్. ఆర్, శ్రీ అధికారి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని జూన్ 21న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన చిత్ర బృందం తాజాగా ‘మల్లేశం’ ట్రైలర్‌ను విడుదల చేసింది. చేనేత కార్మికుడైన మల్లేశం పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కావడానికి దారి తీసిన పరిణామాలు ఏమిటి? అవమానాల నుంచి పద్మశ్రీ వరకు ఎలా ఎదిగారు?చేనేత రంగంలో అతడు సాధించిన ఘనత ఏమిటి? అగ్గిపెట్టెలో పట్టేంత చీరలను నేచి ప్రపంచాన్ని ఎలా అబ్బుర పరిచారు? అనే అంశాలతో పాటు చేనేత ప్రాముఖ్యతను దేశవ్యాప్తంగా చాటి చెప్పడానికి ఆయన చేసిన కృషి ఏమిటనే విషయాలు ఫోకస్ చేస్తూ సినిమా సాగుతుంది. అచ్చమైన తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మాత్రమే గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి ఈ సినిమాలో చాలా సీరియస్‌గా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ప్రియదర్శిని నటుడిగా మరో మెట్టు ఎక్కించేలాగే వుంది ట్రైలర్. ఇక ప్రియదర్శితో పాటు అనన్య, యాంకర్ ఝాన్సీ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ విడుదల చేయనుంది. మార్క్ కె. రాబిన్ స్వరాలందించిన ఈ చిత్రానికి బాలు శాండిల్య సినిమాటోగ్రాఫర్‌గా చేశారు. -
‘శ్రీనివాస కళ్యాణం’ ట్రైలర్ విడుదల
-
కనువిందు చేస్తున్న ‘శ్రీనివాస కళ్యాణం’ ట్రైలర్
‘అ ఆ’ సినిమాతో భారీ హిట్ కొట్టాడు నితిన్. తరువాత ‘లై’, ‘ఛల్ మోహన్‌రంగా’ సినిమాలు చేసినా.. ఆ స్థాయిలో విజయవంతం కాలేదు. అయితే నితిన్ కేరిర్‌కు ఊపునిచ్చిన సినిమా ‘దిల్’. ఈ సినిమాను నిర్మించిన రాజు ‘దిల్’ రాజుగా ఇండస్ట్రీలో ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. మళ్లీ ఇన్నేళ్ల తరవాత నితిన్ హీరోగా, దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న సినిమా శ్రీనివాస కళ్యాణం. ఈ మూవీలో మిక్కి జే మేయర్ అందించిన పాటలు ఇప్పటికే పాపులర్ అయ్యాయి. భారీ తారాగణంతో వస్తోన్న ఈ మూవీపై అందరి దృష్టి నెలకొంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. పెళ్లంటే.. పెద్ద పండుగ అని జయసుధ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకోగా.. పెళ్లి వేడుకను అద్భుతంగా చూపెట్టారు . నితిన్, రాశిఖన్నా కూల్ లుక్స్‌లో బాగున్నారు. ఇక సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్న ప్రకాష్ రాజ్, జయసుధ, రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్‌ల నటన హైలెట్‌గా నిలవనుంది. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 9న విడుదల కానుంది. -
ఎప్పుడు చస్తామో తెలీని ఈ బొంగులో లైఫ్‌లో...
సాక్షి, సినిమా : టాలీవుడ్లో టాలెంటెడ్ నటుడిగా శ్రీ విష్ణుకి మంచి పేరుంది. సపోర్టింగ్ పాత్రలతోపాటు అప్పట్లో ఒకడుండేవాడు.. మెంటల్ మదిలో చిత్రాల్లో లీడ్ క్యారెక్టర్లతో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. తాజాగా అతను నటించిన నీది నాది ఒకే కథ చిత్ర ట్రైలర్ విడుదలైంది. చదువుల్లో పూర్ అయిన ఓ వ్యక్తి.. టీచర్ అయిన తన తండ్రి మెప్పుపొందేందుకు చేసే ప్రయత్నమే నీది నాది ఒకే కథ. ఇంట్రో నుంచే ట్రైలర్‌ను ఆసక్తికరంగా చూపించారు. చిత్తూరు స్లాంగ్‌లో విష్ణు నటన ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా హీరోయిన్ సట్నా టైటస్(బిచ్చగాడు ఫేం) మధ్య నడిచే సన్నివేశాలు ఫన్నీగా ఉన్నాయి. తర్వాత ఎమోషనల్ మోడ్‌లోకి మారిపోయిన ట్రైలర్.. చివర్లో ‘ఎప్పుడు చస్తామో తెలీని ఈ బొంగులో లైఫ్‌లో ఏంట్రా మీ సోదంతా’ అంటూ సీరియస్ డైలాగ్‌తో ముగించారు. నారా రోహిత్ సమర్పణలో ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. మార్చి 23న నీది నాది ఒకే కథ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నీది నాది ఒకే కథ ట్రైలర్ విడుదల
-
వింటున్నావా రామయ్యా..!
నాగ అన్వేష్, కృతిక జంటగా జి.రామ్‌ప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వినవయ్యా రామయ్య’. ‘సిందూరపువ్వు’ కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను నిర్మాత నల్లమలుపు బుజ్జి హదరాబాద్‌లో విడుదల చేసి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇదొక కుటుంబ కథా చిత్రం. అనూప్ చాలా మంచి పాటలు ఇచ్చారు. రసూల్ ఎల్లోర్ ఫొటోగ్రఫీ ఈ సినిమాకు హైలైట్’’ అని చెప్పారు. ‘‘‘ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు’ చిత్రంతో బాలనటునిగా పరిచయం అయ్యా. రామ్‌ప్రసాద్ గారు ఈ సినిమా చాలా బాగా తీశారు’’ అని నాగ అన్వేష్ చెప్పారు. ఈ వేడుకలో నిర్మాతలు ‘సిందూరపువ్వు’ కృష్ణారెడ్డి, కొడాలి వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు.


