పుష్ప మూవీ అప్‌డేట్‌: పుష్ప ట్రైలర్‌ వచ్చేసింది | Allu Arjun Pushpa Movie Trailer Released Watch Video | Sakshi
Sakshi News home page

Pushpa Movie: అదరగొడుతున్న పుష్ప ట్రైలర్‌, మామూలుగా లేదుగా..

Dec 6 2021 5:35 PM | Updated on Dec 6 2021 10:40 PM

Allu Arjun Pushpa Movie Trailer Released Watch Video - Sakshi

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్‌, ఫస్ట్‌లుక్‌, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది.

ఇందులో బన్నీ పుష్పరాజ్‌గా మాస్‌ లుక్‌లో అలరించబోతుండగా అతడికి లుక్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్‌ 1..  పుష్ప ది రైజ్ డిసెంబర్‌  17న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన మేకర్స్‌ నేడు పుష్ప టైటిల్‌ను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కానీ చెప్పిన సమయాని కంటే కొంత ఆలస్యంగా పుష్ప ది రైజ్‌ ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement