Anand Deverakonda: నేరుగా ఓటీటీ 'హైవే'పై వస్తున్న సైకో కిల్లర్‌

Anand Deverakonda HighWay Trailer Released By Naga Shaurya - Sakshi

Anand Deverakonda HighWay Trailer Released By Naga Shaurya: 'దొరసాని' సినిమాతో తెలుగు వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆనంద్‌ 'మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌'తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆనంద్‌ దేవరకొండ. అనంతరం వచ్చిన 'పుష్పక విమానం' చిత్రంతో పర్వాలేదనిపించుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. అయితే ఈసారి థియేటర్‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారా రానున్నాడు ఆనంద్‌ దేవరకొండ. ఇందులో ఆనంద్ దేవరకొండకు జోడీగా మానస అలరించనుండగా, అభిషేక్‌ బెనర్జీ కీలక పాత్ర పోషించారు. 

కె.వి గుహన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా నిర్మించింది. ఈ సినిమా ఆగస్టు 19న నేరుగా ఆహాలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మంగళవారం (ఆగస్టు 16) మూవీ ట్రైలర్‌ను హీరో నాగశౌర్య విడుదల చేశాడు. 'నగరంలో వరుస హత్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న సైకో కిల్లర్‌' అనే న్యూస్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆద్యతం ఉత్కంఠంగా సాగింది. 

చదవండి: నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ

'ఒక అమ్మాయి లైఫ్ సేవ్‌ చేసేందుకే నీ హెల్ప్‌ కావాల్సి వచ్చింది', 'మనతో గడుపుతుంది ఈ కొన్ని గంటలైన, తను నన్ను జీవితాంతం మర్చిపోకుడదురా' వంటి డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇందులో ఆనంద్‌ దేవరకొండ లుక్‌ కొత్తగా ఉంది. ఫొటోగ్రాఫర్‌ అయిన హీరో ప్రేమలో పడుతాడు. సాఫీగా సాగుతున్న అతని ప్రేమ కథలోకి ఓ సీరియల్‌ సైకో కిల్లర్ ఎంట్రీతో ఎలాంటి మలుపు తిరిగింది? అనే కథతో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. 

చదవండి: బిగ్‌బాస్‌ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top