Brahmaji: ఆమె అప్పటికే విడాకులు తీసుకుంది, పెద్దలను ఒప్పించి మరీ

Actor Brahmaji Interesting Comments On His Personal Life - Sakshi

సీనియర్‌ నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీవీ షోలలో, కార్యక్రమాలలో తనదైన కామెడీ పంచ్‌లతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాడు. సోషల్‌ మీడియాలో​ కూడా పలు సంఘటనలపై స్పందిస్తూ చమత్కరిస్తుంటాడు. ప్రస్తుతం సహాయ నటుడు, నెగెటివ్‌ రోల్స్‌ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. సినీ కెరీర్‌తో ఫుల్ బిజీగా ఉన్న బ్రహ్మాజీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అందరిలా సినిమా కష్టాలు పడలేదని, అలాగే తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

''తూర్పు గోదావరి జిల్లాలో పుట్టిన నేను పశ్చిమ గోదావరి జిల్లాలో పెరిగా. మా తండ్రిగారు తహసీల్దార్‌. అప్పట్లో సీనియర్‌ నటుడు సోమయాజులు గారు సైతం ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. ఇదిలా ఉంటే ఆయన నటించిన 'శంకరాభరణం' రిలీజై మంచి విజయం సాధించింది. ఈ సక్సెస్‌తో సోమయాజులు గారికి విపరీతమైన క్రేజ్‌ పెరిగింది. దీంతో ఆయనకు భారీగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అది చూసిన నేను.. సినిమాల్లోకి వెళ్తే ఇంత ఆదరణ ఉంటుందా? అని అనిపించింది. ఎలాగైన పరిశ్రమలోకి వెళ్లాలని అనుకుని, చదువు పూర్తయిన వెంటనే చెన్నై ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాను. 

చదవండి: బిగ్‌బాస్‌ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్‌

నటన శిక్షణ తీసుకుంటున్న ఆ సమయంలోనే కృష్ణవంశీ, రవితేజ, రాజా రవీంద్ర తదితరులతో పరిచయం ఏర్పడింది. గులాబి, నిన్నే పెళ్లాడతా, సింధూరం వంటి సినిమాలతో కెరీర్‌ ప్రారంభంలో మంచి పాపులారిటీ వచ్చింది. తర్వాత పదేళ్లపాటు నేను సంతృప్తి చెందే పాత్రలు లభించలేదు. ఇప్పుడు మాత్రం కమెడియన్, సహాయ నటుడు, నెగెటివ్‌ షేడ్స్‌ వంటి మంచి పాత్రలు వస్తున్నాయి'' అని తెలిపాడు. అలాగే తన పర్సనల్ లైఫ్‌ గురించి చెప్పుకొచ్చాడు

చదవండి: 1947లో పుట్టుక.. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే మరణించిన నటి

అలాగే ''నేను ఒక బెంగాలీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నేను చెన్నైలో ఉన్నప్పుడు ఆమెతో పరిచయం ఏర్పడింది. అయితే నేను మ్యారేజ్‌ చేసుకునే సమయానికే ఆమెకు విడాకులు కాగా, ఒక అబ్బాయి కుడా ఉన్నాడు. ఆమెను ఇష్టపడి పెద్దలను ఒప్పించి మరి వివాహం చేసుకున్నాను. ఇది వరకే బాబు ఉండగా మాకు మళ్లీ పిల్లలు ఎందుకు? అని వద్దనుకున్నాం. ఆ అబ్బాయే ఇప్పడు 'పిట్టకథ' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్డాడు'' అని తన పర్సనల్ లైఫ్‌ గురించి చెప్పుకొచ్చాడు బ్రహ్మాజీ. 

చదవండి: థియేటర్లలో 4 చిత్రాలు, ఓటీటీలో ఎన్నో..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top