కొత్త దారి! | Tamannaah to play lead in Raju Gari Gadhi 3 | Sakshi
Sakshi News home page

కొత్త దారి!

Mar 22 2019 12:27 AM | Updated on Mar 22 2019 12:27 AM

Tamannaah to play lead in Raju Gari Gadhi 3 - Sakshi

తమన్నా

కెరీర్‌లో తమన్నా కొత్తదారికి షిఫ్ట్‌ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు గ్లామరస్‌ పాత్రలవైపే మొగ్గు చూపిన తమన్నా వీలైనప్పుడు స్పెషల్‌ సాంగ్స్‌లోనూ కాలు కదిపారు. కానీ ఇప్పుడు ట్రాక్‌ మార్చి లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలపై దృష్టి పెట్టారామె. ఆల్రెడీ తమన్నా నటించిన రెండు కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలు  హిందీ హిట్‌ ‘క్వీన్‌’ తెలుగు రీమేక్‌ ‘దటీజ్‌ మహాలక్ష్మీ’, తమిళ ‘దేవి 2’ రిలీజ్‌కు రెడీ అయ్యాయి. ఇప్పుడు ఈ మిల్కీబ్యూటీ మరో లేడీ ఓరియంటెడ్‌ ఫిల్మ్‌ ‘రాజుగారి గది 3’కి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ‘దేవి 2, రాజుగారి గది 3’ చిత్రాలు హారర్‌ బేస్డ్‌ కావడం విశేషం.

తాజాగా తమన్నా మరో హారర్‌ సినిమాకు సై అన్నారు. ఈ చిత్రానికి రోహిన్‌ వెంకటేశన్‌ దర్శకత్వం వహించనున్నారు. ‘‘ఈ ఏడాది నేను తీసుకున్న నిర్ణయాల్లో కొత్తగా ఉండే లేడీ ఓరియంటెడ్‌ చిత్రాల్లో నటించాలనే నిర్ణయం ఒకటి. ‘రాజుగారి గది 3’ చిత్రంలో నా పాత్ర రెండు కోణాల్లో ఉండటమే కాకుండా స్క్రీన్‌ ప్లే రెండు కాలసమయాల్లో నడుస్తుంది. ఆసక్తిగా అనిపించి సైన్‌ చేశాను. స్క్రిప్ట్‌ నచ్చితే మరిన్ని లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని చెప్పుకొచ్చారు తమన్నా. ‘రాజుగారి గది 3’ చిత్రానికి ఓంకార్‌ దర్శకత్వం వహిస్తారు. ఇవి కాకుండా చిరంజీవి ‘సైరా’ సినిమాలో నర్తకి లక్ష్మీ అనే ఓ కీలక పాత్రను తమన్నా చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement