తమన్నాకు దాదాసాహెబ్‌ అవార్డు

Tamannaah Bhatia Got Dadasaheb Phalke Award For Baahubali - Sakshi

సాక్షి, ముంబై : మిల్కీ బ్యూటీ ఖాతాలో మరో ప్రతిష్టాత్మక అవార్డు చేరింది. ఇటీవలే జీ సంస్థలు నిర్వహించిన అప్సర అవార్డుల్లో శ్రీదేవి అవార్డు అందుకున్న తమన్నా తాజాగా మరో అవార్డుకు ఎంపికయ్యారు. ప్రతిష్టాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే ఎక్స్‌లెన్స్‌ అవార్డు ఆమెను వరించింది. తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన బాహుబలి సిరీస్‌లో తమన్నా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో మొదటి భాగంలో తమన్నా అద్భుత నటనకు గాను ఎక్స్‌లెన్స్‌ అవార్డు అందుకోన్నారు. తమన్నాతో పాటు రణ్‌వీర్‌ సింగ్‌, అనుష్క శర్మలకు కూడా ఈనెల 21న అవార్డులు ప్రదానం చేయనున్నట్టు ముంబైకి చెందిన దాదాసాహెబ్‌ ఫాల్కే ఫౌండేషన్‌ తెలిపింది.

తనకు ఈ అవార్డు ప్రకటించడం పట్ల హీరోయిన్‌ తమన్నా సంతోషం వ్యక్తం చేశారు. భారతీయ సినిమా రంగానికి దాదాసాహెబ్ ఫాల్కే ఎంతో సేవ చేశారని, ఆయన పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌ నుంచి అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం తమన్నా తెలుగులో నా నువ్వే.. క్వీన్‌ రీమేక్‌లో నటిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top