తమన్నాకు ఏసీ లేకుండా నిద్రపట్టదంటా!

Tamanna Simhadri Highlights In Bigg Boss 3 Telugu - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో గత రెండు రోజులుగా సైక్లింగ్‌ టాస్క్‌తో తలమునకలై ఉన్నారు. నిన్నటి ఎపిసోడ్స్‌లో మరికొన్ని టాస్క్‌లను ఇచ్చి సైక్లింగ్‌ టాస్క్‌కు స్వస్తి పలకవచ్చనే ఆప్షన్‌ ఇచ్చాడు. దీపాన్ని ఆరిపోకుండా చూసుకునే టాస్క్‌లో మహేష్‌, పిడకలు కొట్టే టాస్క్‌లో శ్రీముఖి, అలీ రెజా.. ఎక్వేరియంలోంచి నాణెలు తీసే టాస్క్‌లో వితికా విజయం సాధించగా.. సైక్లింగ్‌ టాస్క్‌కు రద్దు కాబడి.. నీళ్లు, వంటగ్యాస్‌, హౌస్‌ యాక్సరీస్‌ అందుబాటులోకి వచ్చాయి.

అయితే ఈ టాస్క్‌లన్నింటిలో.. చెత్త ప్రదర్శన ఇచ్చిన ఇద్దరు కంటెస్టెంట్ల పేర్లను ఏకాభిప్రాయంతో చెప్పాలని హౌస్‌మేట్స్‌ అందరిని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. అయితే ఎవరి పేరు చెప్పాలో తేల్చుకునేలోపు తమన్నా లేచింది. అయితే అందరూ ఓకే అని.. ఆమె టాస్కలో సరిగా పనిచేయలేదు అని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇక రెండో వ్యక్తిగా ఎవర్నీ సెలెక్ట్‌ చేయాలని అనుకుంటూ ఉండగా.. వరుణ్‌ సందేశ్‌ నిలబడ్డాడు. ఎవరూ తేల్చుకోలేకపోతున్నారు కాబట్టి తాను లేచానని అనగా.. రాహుల్‌ కూడా లేవడానికి సిద్దపడ్డాడు. అయితే వరుణ్‌ వారించి వద్దన్నాడు. తాను, తమన్నా టాస్క్‌లో వరెస్ట్‌ కంటెస్టెంట్స్‌ అంటూ బిగ్‌బాస్‌కు తెలిపాడు.

దీంతో వారిద్దరిని జైల్లో వేయాల్సిందిగా వితికాను ఆదేశించాడు. ఎవరూ చెప్పడం లేదని మళ్లీ దానికో మూడు గంటల చర్చ అని అందుకు తానే నిల్చున్నాని వరుణ్‌.. రాహుల్‌తో చెప్పుకొచ్చాడు. జైల్లో ఒక్క బెడ్‌ ఉండటంతో అది తమన్నాకు ఇచ్చేసి.. తాను నేలపై పడుకుంటానని వరుణ్‌ తెలిపాడు. ఇక జైల్లోకి వెళ్లిన తమన్నా.. వెంటనే ఏడవడం మొదలుపెట్టింది. తనకు ఏసీ లేకపోతే నిద్రపట్టదని శ్రీముఖితో చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంది. ఇక ఈ డైలాగ్‌తో నెటిజన్లు ఆమెను ఆడుకుంటున్నారు.

తమన్నాకు ఏసీ లేకుంటే నిద్రపట్టదని, అలాగే జైల్లో కూడా ఓ ఏసీని, టీవీని పెట్టించండని కామెంట్లు చేస్తున్నారు. తన ప్రవర్తనపై విసుగుచెందిన నెటిజన్లు ఆమెను ఎలిమినేట్‌ చేయండని బిగ్‌బాస్‌ను కోరుతున్నారు. రవికృష్ణ-తమన్నా విషయంపైనా నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అలీ రెజా డ్రెస్‌ వేసుకోకపోవడంతో తమన్నా రచ్చ చేయగా.. ఆమె డ్రెస్సింగ్‌పైనా కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంట్లోకి వచ్చిన నాలుగైదు రోజులకే తమన్నా వ‍్యవహారంపై కొందరు ఇంటిసభ్యులు గుర్రుగా ఉన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top