తమన్నా కస్టడీలో కుక్క! | Tamanna Bhatia founds cocker spaniel pet dog | Sakshi
Sakshi News home page

తమన్నా కస్టడీలో కుక్క!

Sep 1 2014 4:39 PM | Updated on Sep 2 2018 3:30 PM

తమన్నా కస్టడీలో కుక్క! - Sakshi

తమన్నా కస్టడీలో కుక్క!

ముంబై సబర్బన్ లో ఎప్పుడూ బిజీగా ఉండే దక్షిణ ఖార్ లో తమన్నాకు తప్పి పోయిన ఓ పెంపుడు కుక్క కనిపించింది.

ప్రముఖుల హోదాలో ఉన్న వారు సాధారణంగా ప్రైవసీని కోరుకుంటారు. ప్రజా జీవితంలోకి రావాలని ఉన్నా.. అందులో ఉండే అసౌకర్యానికి భయపడి వెనుకంజ వేస్తారు. అయితే వారందరికి అతీతంగా తనకెందుకులే అనే విషయాన్ని పక్కన పెట్టి సినీ నటి తమన్నా పెంపుడు జంతువుల పట్ల ప్రేమను ప్రదర్శించారు. 
 
ముంబై సబర్బన్ లో ఎప్పుడూ బిజీగా ఉండే దక్షిణ ఖార్ లో తమన్నాకు తప్పి పోయిన ఓ పెంపుడు కుక్క కనిపించింది. అయితే ఎందుకులే అని కోకర్ స్పానియల్ జాతికి చెందిన కుక్క వదిలేయకుండా తన ఇంటికి తీసుకువచ్చింది. 
 
అంతేకాకుండా దాని యజమాని వద్దకు చేర్చాలని ప్రయత్నాలు చేశారు. అయితే యజమాని ఆచూకీ తెలియకపోవడంతో సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ఎవరిదో పెంపుడు కుక్క తప్పిపోయింది... దాని యజమాని గుర్తించినట్లయితే సంప్రదించాలని ఓ ఫోన్ నెంబర్ తోపాటు ఫోటోను ట్విటర్ లో పోస్ట్ చేసింది. 
Advertisement
 
Advertisement
Advertisement