పోలీస్‌గా కనిపిస్తా... | Tamanna as police officer in Aagadu movie | Sakshi
Sakshi News home page

పోలీస్‌గా కనిపిస్తా...

Jan 6 2014 12:15 AM | Updated on Sep 17 2018 6:26 PM

‘తమన్నా పని అయిపోయినట్టే... తట్టా బుట్టా సర్దుకొని ఇక ముంబయ్ చెక్కేయడమే తరువాయి’ అని అనుకున్న వారందరికీ భారీ లెవెల్లో షాక్ ఇచ్చారు తమన్నా.

‘తమన్నా పని అయిపోయినట్టే... తట్టా బుట్టా సర్దుకొని ఇక ముంబయ్ చెక్కేయడమే తరువాయి’ అని అనుకున్న వారందరికీ భారీ లెవెల్లో షాక్ ఇచ్చారు తమన్నా. ఒక్కసారిగా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌ల్లో బిజీ అయిపోయి... సాటి హీరోయిన్లకి సవాల్ విసిరారు. బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌తో ఓ సినిమా, సైఫ్ ఆలీఖాన్‌తో మరో సినిమా. తెలుగులో ఆగడు, బాహుబలి, కోలీవుడ్‌లో అజిత్‌తో ‘వీరమ్’... అన్నీ ప్రతిష్టాత్మక చిత్రాలే . ఇదిలావుంటే... ఇటీవల తమన్నా తన పారితోషికం అమాంతం పెంచేసిందని, ఓ తెలుగు నిర్మాత తన సినిమాలో నటింపజేయడానికి తమన్నాని సంప్రదించగా... పారితోషికాన్ని భారీగా పెంచేసి చెప్పిందని, దాంతో ఖంగుతిన్న ఆ నిర్మాత చక్కా పోయాడని ఓ వార్త, ఫిలింనగర్‌లో షికారు చేస్తోంది.
 
  దీనిపై ఇటీవల తమన్నాను వివరణ అడగ్గా... ‘‘నేను ఫుల్ ఫామ్‌లో ఉన్న రోజుల్లోనే పారితోషికం పెంచలేదు. నాకు ఎంత ఇస్తే కరెక్టో నా నిర్మాతలకు తెలుసు. అయినా... ప్రస్తుతం నేనున్న బిజీలో కొత్త సినిమాను ఒప్పుకోలేను. ఈ విషయంపై నన్నెవరూ సంప్రదించలేదు కూడా’’అని చెప్పారు. ‘ఆగడు’లో పోలీస్ పాత్ర చేస్తున్నారటగా.. అనడిగితే- ‘‘అందులో నేను పూర్తిస్థాయి పోలీస్‌నా, లేక.. ఆ గెటప్‌లో కాసేపు సరదాగా కనిపిస్తానా అనేది ప్రస్తుతం మాత్రం సస్పెన్స్. అయితే, నా పాత్ర మాత్రం ‘ఆగడు’లో చాలా సరదాగా ఉంటుంది. తొలిసారి పోలీస్ గెటప్‌లో కనిపించడం మాత్రం ఉద్వేగంగానే ఉంది’’ అని చెప్పుకొచ్చారు తమన్నా. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement