మళ్లీ రచ్చ చేస్తుందట | tamanna again team up with ram charan | Sakshi
Sakshi News home page

మళ్లీ రచ్చ చేస్తుందట

Dec 20 2013 12:24 AM | Updated on Jul 14 2019 1:57 PM

తమన్నా - Sakshi

తమన్నా

ఫస్ట్‌లుక్‌లోనే ప్రేక్షకుల మనసుల్ని దోచేసిన జంట రామ్‌చరణ్, తమన్నా. గత ఏడాది బాక్సాఫీస్ వద్ద ఈ జంట చేసిన ‘రచ్చ’ అంతా ఇంతా కాదు.

 ఫస్ట్‌లుక్‌లోనే ప్రేక్షకుల మనసుల్ని దోచేసిన జంట రామ్‌చరణ్, తమన్నా. గత ఏడాది బాక్సాఫీస్ వద్ద ఈ జంట చేసిన ‘రచ్చ’ అంతా ఇంతా కాదు. ‘వానా వానా వెల్లువాయె’ పాటలో వీరిద్దరూ కనబరిచిన కెమిస్ట్రీని యువతరం తేలిగ్గా మరిచిపోగలరా! ఇప్పుడు వీరిద్దరి గురించి చర్చ దేనికనుకుంటున్నారా! మళ్లీ త్వరలోనే ఈ జంట వెండితెరపై సాక్షాత్కరించనుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో, బండ్ల గణేష్ నిర్మించనున్న సినిమాలో చరణ్‌కు జోడీగా తమన్నాను ఖరారు చేసినట్లు తెలిసింది. చరణ్ పక్కన కొత్త నాయిక ఉంటుందని మొదట్లో వార్తలొచ్చాయి. చివరకు బంతి తమన్నా కోర్టుకు రాగానే... ఆమె వెంటనే ‘ఓకే’ చెప్పేశారు. జనవరి 23 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. లొకేషన్ల ఎంపిక కోసం ఇటీవలే కృష్ణవంశీ, బండ్ల గణేష్ కలిసి పొలాచ్చి వెళ్లినట్లు తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు తెలియాల్సిఉంది.

Advertisement
 
Advertisement
Advertisement