తైముర్‌ @ 2 | taimur ali khan birthday celebration in south africa | Sakshi
Sakshi News home page

తైముర్‌ @ 2

Dec 21 2018 12:44 AM | Updated on Dec 21 2018 12:44 AM

taimur ali khan birthday celebration in south africa - Sakshi

సైఫ్‌ అలీఖాన్‌, తైముర్‌ అలీఖాన్‌, కరీనా కపూర్‌

సౌతాఫిక్రాలో సాగర తీరాన హాయిగా సేద తీరుతున్నారు సైఫ్‌ అలీఖాన్‌ అండ్‌ కరీనా కపూర్‌. వారితో పాటు ఈ దంపతుల ముద్దుల తనయుడు తైముర్‌ అలీఖాన్‌ ఉండకుండా ఉండడు కదా. పైగా తైముర్‌ పుట్టిన రోజు కూడా. అవును.. తైముర్‌ రెండో పుట్టినరోజు వేడుకలు సౌతాఫ్రికాలో జరిగాయి. కొన్ని ఫొటోలను కరీనా కపూర్‌ సోషల్‌ మీడియాలో పంచుకోగా మరికొన్ని వైరల్‌ అయ్యాయి. కాగా సౌత్‌ ఆఫ్రికాకి వెళ్లక ముందు ముంబైలో సన్నిహితులు, స్నేహితులకు ప్రీ–బర్త్‌డే పార్టీ ఇచ్చారు సైఫీనా.

ఆడంబరాలకు దూరంగా కేవలం తమ సమక్షంలోనే తనయుడి బర్త్‌డే జరగాలని సౌతాఫ్రికా వెళ్లారు. ‘‘తైముర్‌ని అందరూ సెలబ్రిటీలా చూస్తున్నారు. తనకు నార్మల్‌ లైఫ్‌ ఇవ్వడానికి చాలా కష్టపడుతున్నాం’’ అని ఓ సందర్భంలో కరీనా అన్నారు. అందుకే పుట్టిన రోజు వేడుకల్ని ఇలా ప్లాన్‌ చేశారేమో. ఇక సినిమాల విషయానికి వస్తే... అజయ్‌ దేవగన్‌ హీరోగా నటిస్తున్న ‘తానాజీ’ చిత్రంలో నటిస్తున్నారు సైఫ్‌. అలాగే ‘వీరే ది వెడ్డింగ్‌’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన కరీనా ‘గుడ్‌న్యూస్‌’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement