హాలిడే స్పాట్ లో హీరోయిన్ ఇల్లు కష్టాలు! | Taapsee Pannu to buy vacation home in Goa | Sakshi
Sakshi News home page

హాలిడే స్పాట్ లో హీరోయిన్ ఇల్లు కష్టాలు!

May 28 2016 7:19 PM | Updated on Aug 28 2018 4:30 PM

హాలిడే స్పాట్ లో హీరోయిన్ ఇల్లు కష్టాలు! - Sakshi

హాలిడే స్పాట్ లో హీరోయిన్ ఇల్లు కష్టాలు!

టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను ఇంటి కోసం తెగ కష్టాలు పడుతోంది.

టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను ఇంటి కోసం తెగ కష్టాలు పడుతోంది. అదేంటీ ఇటీవలే ముంబైలో ఇల్లు కొనుక్కుంది కదా. అప్పుడే మరో ఇల్లు కొనడానికి తొందర పడుతోంది. అయితే అందుకు అనుకున్నట్లుగా ఇప్పుడు తాప్సీ ఇంటి కోసం ముంబైలో కాదు గోవాలో ప్రయత్నాలు మొదలుపెట్టింది. గతేడాది బేబీ మూవీ కోసం ఆమె అక్కడ షూటింగ్స్ లో పాల్గొంది. గోవా అందాలు ఆమెను ఆకర్షించాయి. అందుకే హాలీడే ట్రిప్ కు అక్కడికి వెళితే ఉండటానికి ఇల్లు కావాలి కదా. వెంటనే గోవాలో ఇల్లు తీసుకోవాలని ఈ నెల మొదట్లో కొన్ని రోజులు అక్కడ ప్రయత్నాలు చేసిందని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

దక్షిణ గోవాలో ఆమె ఇల్లు కొనేందుకు డిసైడ్ అయిపోయారని, త్వరలో ఆ వార్త బయటకు రానుందని సమాచారం. గోవాలో అంతా చాలా స్లోగా, ప్రశాంతంగా జరిపోతుంటాయని తాప్సీ ముచ్చట పడుతోంది. బిజీబిజీ జీవితంలో అప్పుడప్పుడూ హాలిడే స్పాట్ కు వెళ్లాలని, అందులోనూ పోర్చుగీస్ వారు కట్టిన ఇల్లు మరీ బాగుంటాయని ఢిల్లీ భామ తాప్సీ అభిప్రాయపడుతోంది. రాత్రివేళల్లో బీచ్ అందాలను ఎంజాయ్ చేయాలని, అక్కడ చాలా ప్రశాంత వాతావరణం ఉంటుందని అందుకే అక్కడ ఇల్లు వెతికే పనిలో తాప్సీ ఉందని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement