ఓ తీపి జ్ఞాపకం... | Sweet Memory... | Sakshi
Sakshi News home page

ఓ తీపి జ్ఞాపకం...

May 15 2014 10:25 PM | Updated on Jul 15 2019 9:21 PM

ఓ తీపి జ్ఞాపకం... - Sakshi

ఓ తీపి జ్ఞాపకం...

‘చివరి క్షణం వరకూ నటునిగానే కొనసాగాలన్న నాన్నగారి ఆశకు ప్రతిరూపమే ‘మనం’ సినిమా’’ అని నాగార్జున చెప్పారు. అక్కినేని కుటుంబం నిర్మించిన చిత్రం ‘మనం’.

‘‘చివరి క్షణం వరకూ నటునిగానే కొనసాగాలన్న నాన్నగారి ఆశకు ప్రతిరూపమే ‘మనం’ సినిమా’’ అని నాగార్జున చెప్పారు. అక్కినేని కుటుంబం నిర్మించిన చిత్రం ‘మనం’. మహానటుడు స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ -‘‘నాన్నగారి చివరి సినిమా ‘మనం’ జనహృదయాల్లో కలకాలం గుర్తుండిపోతుంది. అనూప్ స్వరపరిచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రం నాకో తీపి జ్ఞాపకం’’ అన్నారు. శ్రీయ, సమంత కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన్, కెమెరా: పి.ఎస్.వినోద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సుప్రియ, సమర్పణ: అక్కినేని అన్నపూర్ణ, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్.
 

Advertisement
 
Advertisement
Advertisement