బై ముంబై.. మళ్లీ వస్తానో.. లేదో: నటి

Sushant Singh Rajput Co Star Sanjana Sanghi Leaves Mumbai - Sakshi

తీవ్ర భావోద్వేగానికి లోనైన నటి సంజన సాంఘి

‘‘బై.. ముంబై. నిన్ను దర్శించడానికి నాకు నాలుగు నెలలు పట్టింది. నేను ఢిల్లీకి తిరిగి వెళ్లిపోతున్నాను. నీ వీధులన్నీ చాలా కొత్తగా, వింతగా కనిపిస్తున్నాయి. ఖాళీగా ఉన్నాయి. బహుశా నా గుండెలోని బాధ వల్లే నా చూపు అలా మారిందేమో! లేదంటే నువ్వు కూడా బాధలో ఉన్నావేమో.. త్వరలోనే మళ్లీ కలుస్తాం.. లేదంటే కలవలేకపోవచ్చు’’ అంటూ బాలీవుడ్‌ నటి, ‘దిల్‌ బేచారా’ ఫేం సంజన సాంఘి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తాను ముంబైని వీడి స్వస్థలం ఢిల్లీకి వెళ్తున్నట్లు బుధవారం వెల్లడించారు. ముంబై ఎయిర్‌పోర్టులో దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన సంజన ఈ మేరకు తన మనసులోని భావాలు పంచుకున్నారు. కాగా 2011లో విడుదలైన ‘రాక్‌స్టార్‌’ సినిమాతో సంజన బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. రణ్‌బీర్‌ కపూర్‌, నర్గిస్‌ ఫక్రీతో ఆ మూవీలో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. (ముందుకు సాగిపోవాలి అంతే: జెనీలియా)

ఈ క్రమంలో దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ హీరోగా తెరకెక్కిన ‘దిల్‌ బేచారా’ సినిమాలో తొలిసారి హీరోయిన్‌గా అవకాశం దక్కించుకున్నారు. అయితే లాక్‌డౌన్‌ నేపథ్యంలో థియేటర్లలో విడుదలకు నోచుకోని ఈ సినిమా.. ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ‘ఫాక్స్‌‌ స్టార్‌ స్టూడియోస్‌’ నిర్మించిన ఈ చిత్రాన్ని డిస్నీ, హాట్‌స్టార్‌ జూలై 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాయి. ఇక సుశాంత్‌ నటించిన చివరి సినిమా కావడంతో దీన్ని థియేటర్‌లోనే విడుదల చేయాలని అతడి అభిమానులు నిర్మాతలను డిమాండ్‌ చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చిత్రబృందం నిర్ణయంతో తీవ్ర నిరాశలో మునిగిపోయినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. (‘గత నెల సుశాంత్‌ 50 సిమ్‌లు మార్చాడు’)

కాగా ప్రస్తుతం సంజన పోస్టు చూస్తుంటే ఆమె సైతం నిరాశలో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. కథానాయికగా వెండితెరపై కనిపించే అవకాశం చేజారిందనే బాధ ఓవైపు.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మళ్లీ ఇప్పుడప్పుడే లీడ్‌రోల్‌ దక్కదనే ఆవేదన మరోవైపు ఆమెను వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది. ఇక సుశాంత్‌ ఆత్మహత్య విషయం తెలిసిన తర్వాత సంజన ఉద్వేగానికి లోనైన విషయం తెలిసిందే. సుశాంత్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. కాలం గాయాలను మాన్పుతుందని ఎవరు అన్నారో కానీ అది అబద్ధం. ఆ గాయం మళ్లీ మళ్లీ మనసును గాయపరుస్తుంది. బాధ పెరుగుతూనే ఉంటుదంటూ ఇన్‌స్టాలో వేదాంత ధోరణిలో సుదీర్ఘ పోస్టు పెట్టారు.(సుశాంత్ ఆఖ‌రు సినిమా కూడా ఓటీటీలోనే..)

Whoever said time helps heal all wounds, was lying. Some feel like they’re being ripped open, again and again, and bleeding - Of moments that now will forever remain memories, Of laughs together that were but will never again be, Of questions that will remain unanswered, Of disbelief, that only keeps growing But these wounds also contain a film, a gift that everyone is yet to see, Wounds that contain dreams, plans, and desires for our country’s children, their education and their future that will be fulfilled, Wounds that contain a passion for an endless creative zest for every artist there is, Wounds that contain the hope for a world that promises to uphold honesty, integrity, kindness and embraces individuality - rid of all toxicity, I vow that I will do everything to make sure each of these dreams are fulfilled, like you always wanted me to. Except, you’d promised we’d do it all together. . . . #SushantSinghRajput #ThinkingOfYou

A post shared by Sanjana Sanghi (@sanjanasanghi96) on

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top