24లో సూర్య సొంత గొంతు | suriya own dubbing for 24 telugu | Sakshi
Sakshi News home page

24లో సూర్య సొంత గొంతు

Mar 12 2016 12:01 PM | Updated on Sep 3 2017 7:35 PM

24లో సూర్య సొంత గొంతు

24లో సూర్య సొంత గొంతు

కోలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు సూర్య. తన ప్రతి సినిమాను తమిళ్తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేసే సూర్య నెక్ట్స్ సినిమా 24 విషయంలో కూడా అదే ఫార్ములాను...

కోలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు సూర్య. తన ప్రతి సినిమాను తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేసే సూర్య తదుపరి సినిమా 24 విషయంలో కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. అయితే ఇప్పటివరకు సూర్య సినిమాలకు వేరే వ్యక్తితో డబ్బింగ్ చెప్పించేవారు. తమ్ముడు కార్తీ తెలుగులో డబ్బింగ్ చెప్పటం ప్రారంభించినా సూర్య మాత్రం రిస్క్ తీసుకోలేదు. అయితే 24 చిత్రంలో ఆ రిస్క్కు రెడీ అవుతున్నాడు సూర్య.

మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పై టాలీవుడ్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.  అందుకు తగ్గట్టుగా ఇటీవల రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్న సూర్య ఒక పాత్రకు తన సొంత గొంతుతో తెలుగు డబ్బింగ్ చెపుతున్నాడు. ఇదే వర్కవుట్ అయితే ఇక ముందు రాబోయే సినిమాలన్నింటిలో ఫ్యాన్స్ సూర్య సొంత గొంతు వినొచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement