సూర్య కొత్త సినిమా.. క్రేజీ సాంగ్ రిలీజ్ | Suriya Laatest Movie Scene Song Release | Sakshi
Sakshi News home page

Scene Movie: సూర్య కొత్త సినిమా.. క్రేజీ సాంగ్ రిలీజ్

Oct 8 2026 8:58 PM | Updated on Oct 8 2026 8:59 PM

 Suriya Laatest Movie Scene Song Release

కోలీవుడ్ హీరో సూర్య వెంకీ ‍అట్లూరి డైరెక్షన్‌లో వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీతో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీలో మమితా బైజు హీరోయిన్‌గా మెప్పించింది. ఈ మూవీ సక్సెస్‌ ఎంజాయ్ చేస్తుండగానే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. సీన్ మూవీతో అభిమానులను అలరించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. అమ్మో ఇది ఎవర్రా అంటూ సాగే లిరికల్ వీడియో విడులద చేశారు. ఈ పాటకు రాకేందు మౌళి లిరిక్స్ అందించగా.. వినాయక్ ఆలపించారు. ఈ పాటను సుసిన్ శ్యామ్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ సినిమాకు జితు మాధవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య మరోసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో సూర్య సరసన నజ్రియా హీరోయిన్‌గా కనిపించనుండగా.. నస్లెన్‌, ఆనంద్‌రాజ్‌, లాల్‌, రాజ్‌ ప్రియన్‌  కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబరు 6న విడుదల చేయనున్నారు. ఈ మూవీని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో జ్యోతిక, సూర్యనే  నిర్మిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి సుసిన్ శ్యామ్ సంగీతమందిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement