'నాకు సూపర్ ఉమెన్ కావాలని ఉంది' | Sunny Leone expresses desire to be part of superhero film | Sakshi
Sakshi News home page

'నాకు సూపర్ ఉమెన్ కావాలని ఉంది'

Jul 26 2015 6:04 PM | Updated on Apr 3 2019 6:23 PM

'నాకు సూపర్ ఉమెన్ కావాలని ఉంది' - Sakshi

'నాకు సూపర్ ఉమెన్ కావాలని ఉంది'

తనకు సూపర్ ఉమెన్ కావాలని ఉందని ప్రముఖ శృంగార తార సన్నీలియోన్ అంది. ఏదో ఒకరోజు సూపర్ హీరో అనే చిత్రంలో భాగస్వామిని కావాలని అనుకుంటున్నాని, అదే తనకున్న అసలైన కోరిక అని చెప్పింది.

ముంబై: తనకు సూపర్ ఉమెన్ కావాలని ఉందని ప్రముఖ శృంగార తార సన్నీలియోన్ అంది. ఏదో ఒకరోజు సూపర్ హీరో అనే చిత్రంలో భాగస్వామిని కావాలని అనుకుంటున్నాని, అదే తనకున్న అసలైన కోరిక అని చెప్పింది. బాలీవుడ్లో అడుగుపెట్టి సంచలన తారగా మారిన ఈ అమ్మడు ఈ మధ్య పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. యువత చెడిపోయేలా, గృహిణులకు ఇబ్బందికలిగేలా హాఫ్ న్యూడ్ చిత్రాలతో అసభ్యకరంగా కనిపిస్తోందని పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి.

అప్పటి నుంచి కొంత ఖాళీగా ఉన్నట్లు కనిపించిన ఆమెను ఓ మీడియా సంప్రదించింది. సన్నీ మీకు మీ జీవితంలో చేయాలనిపిస్తున్న పాత్ర ఏమిటి ? అని ప్రశ్నించగా వెంటనే తాను సూపర్ మెన్ చిత్రంలో సూపర్ ఉమెన్గా నటించాలని ఉందని, సమాన స్థాయి పాత్ర పోషించాలని అనుకుంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆమె స్ప్లిట్ విల్లా అనే రియాలిటీ షో చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement