'ఘాయల్ రిటర్న్స్'కు సన్నీ డియోల్ దర్శకత్వం | Sunny Deol back at direction with 'Ghayal Returns' | Sakshi
Sakshi News home page

'ఘాయల్ రిటర్న్స్'కు సన్నీ డియోల్ దర్శకత్వం

Nov 29 2013 3:12 PM | Updated on Apr 3 2019 6:23 PM

'ఘాయల్ రిటర్న్స్'కు సన్నీ డియోల్ దర్శకత్వం - Sakshi

'ఘాయల్ రిటర్న్స్'కు సన్నీ డియోల్ దర్శకత్వం

1990లో ఘనవిజయం సాధించిన 'ఘాయల్' చిత్రాన్ని సీక్వెల్ తెరకెక్కించేందుకు బాలీవుడ్ ప్రముఖ నటుడు సన్నీడియోల్ సన్నద్ధమవుతున్నారు.

ముంబై: 1990లో ఘనవిజయం సాధించిన 'ఘాయల్' చిత్ర సీక్వెల్ ను తెరకెక్కించేందుకు  బాలీవుడ్ ప్రముఖ నటుడు సన్నీడియోల్ సన్నద్ధమవుతున్నారు. ఘాయల్ రిటర్న్స్ పేరుతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు 57 ఏళ్ల  సన్నీ తెలిపాడు. ఈ చిత్రానికి రాహుల్ రావాలీ దర్శకత్వం వహిస్తాడని ముందు అనుకున్నా, కొన్ని అనివార్యకారణాల వల్ల అతను ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు.  దీంతో ఆ అవకాశం సన్నీ డియోల్ ను వరించింది.  ఈ చిత్ర విశేషాలను సన్నీ మీడియాతో పంచుకున్నారు.

 

ప్రస్తుతం ఘాయల్ రిటర్న్స్ స్క్రిప్ట్ వర్క్లో నిమగ్నమైయ్యామని, ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో సెట్స్ మీదుకు తీసుకువస్తామని తెలిపాడు. తను తీయబోయే ఘాయల్ రిటర్న్స్ పాత చిత్రానికి కొనసాగింపు మాత్రం కాదని తెలిపాడు. 1983లో 'బెతాబ్' సినిమాతో బాలీవుడ్కు పరిచయమైన సన్నీ..1999లో దిల్లగీ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement