పంపిణీ రంగంలోకి సందీప్ కిషన్ | Sundeep Kishan distributes his Beeruva | Sakshi
Sakshi News home page

పంపిణీ రంగంలోకి సందీప్ కిషన్

Jan 19 2015 11:22 PM | Updated on Sep 15 2019 12:38 PM

పంపిణీ రంగంలోకి సందీప్ కిషన్ - Sakshi

పంపిణీ రంగంలోకి సందీప్ కిషన్

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో జోరు మీద ఉన్న సందీప్ కిషన్ ప్రస్తుతం ‘బీరువా’, ‘టైగర్’ తదితర చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.

 ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో జోరు మీద ఉన్న సందీప్ కిషన్ ప్రస్తుతం ‘బీరువా’, ‘టైగర్’ తదితర చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘బీరువా’ ఈ నెల 23న విడుదల కానుంది. ఈ చిత్రంతో ఆయన పంపిణీదారునిగా మారుతున్నారు. ‘‘ఈ సినిమాపై నమ్మకంతో గుంటూరు ఏరియా హక్కుల్ని నా స్నేహితుడు రాజాతో కలిసి తీసుకున్నా. టైటిల్ కార్డు నుంచి శుభం కార్డు వరకూ ఈ ‘బీరువా’ బాగా నవ్విస్తుంది’’ అని సందీప్ కిషన్ తెలిపారు. ఉషాకిరణ్ ఫిలిమ్స్, ఆనంది ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. కణ్మణి దర్శకుడు. రామోజీరావు నిర్మాత. వినోదంతో పాటు ఈ సినిమాలో ఓ కొత్త అంశం ఉందని హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు పేర్కొన్నారు. ఈ సమావేశంలో నరేశ్, జెమిని కిరణ్, సుబ్రతో చౌదరి, అనితా చౌదరి, సురభి, గౌతంరాజు తదితరులు మాట్లాడారు.
 

Advertisement
 
Advertisement
Advertisement