ఆ భారీ చిత్రం ఆగిపోయిందా..? | Sundar c Sanghamitra movie stopped | Sakshi
Sakshi News home page

ఆ భారీ చిత్రం ఆగిపోయిందా..?

Aug 28 2017 1:14 PM | Updated on Sep 17 2017 6:03 PM

ఆ భారీ చిత్రం ఆగిపోయిందా..?

ఆ భారీ చిత్రం ఆగిపోయిందా..?

బాహుబలి ఘనవిజయం సాధించిన తరువాత కోలీవుడ్ నుంచి అదే స్థాయిలో మరో భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు

బాహుబలి ఘనవిజయం సాధించిన తరువాత కోలీవుడ్ నుంచి అదే స్థాయిలో మరో భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తమిళ నటుడు, దర్శకుడు సుందర్ సి ఏకంగా 250 కోట్ల బడ్జెట్ తో సంఘమిత్ర అనే భారీ ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేశాడు. భారీ తారాగణంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేశాడు.

అయితే ఈ సినిమా ఎనౌన్స్మెంట్ దగ్గర నుంచే కష్టాలు మొదలయ్యాయి. దర్శకుడు అనుకున్న హీరోలు సినిమా చేసేందుకు అంగీకరించకపోవటంతో జయం రవి, ఆర్యలతో సరిపెట్టుకున్నాడు. ఇక టైటిల్ రోల్ కు ఫైనల్ చేసిన శృతి హాసన్ చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వటంతో సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండా ఆగిపోయింది. ప్రస్తుతం సంఘమిత్ర పాత్రకు నటి కోసం అన్వేషిస్తున్నారు. హన్సిక చేస్తుందన్న ప్రచారం జరిగినా.. ఆమె కూడా తాను ఈ ప్రాజెక్ట్ లో లేనని క్లారిటీ ఇచ్చేసింది.

దీంతో ఆలోచనలో పడ్డ దర్శకుడు సుందర్ సి, సంఘమిత్ర కన్నా ముందు మరో సినిమా చేసే ఆలోచన చేస్తున్నాడట. సంతానం లీడ్ రోల్ లో తానే తెరకెక్కించిన కలకళప్పు సినిమాకు సీక్వల్ రూపొందించే ఆలోచనలో ఉన్నాడు సుందర్. సుందర్ ఈ సీక్వల్ ను గనుక ప్రారంభిస్తే సంఘమిత్ర మరింత ఆలస్యమవుతుందన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement