సుల్తాన్కు కళ్లు తిరిగే కలెక్షన్లు | sultan mints rs 345 crores gross world wide | Sakshi
Sakshi News home page

సుల్తాన్కు కళ్లు తిరిగే కలెక్షన్లు

Jul 12 2016 3:21 PM | Updated on Sep 4 2017 4:42 AM

సుల్తాన్కు కళ్లు తిరిగే కలెక్షన్లు

సుల్తాన్కు కళ్లు తిరిగే కలెక్షన్లు

ఇనుప నరాలు, ఉక్కు పిడికిళ్లతో గోదాలో ప్రత్యర్థులను చిత్తు చేసిన బాలీవుడ్ సుల్తాన్.. అవలీలగా రూ. 300 కోట్ల మార్కు దాటేశాడు.

ఇనుప నరాలు, ఉక్కు పిడికిళ్లతో గోదాలో ప్రత్యర్థులను చిత్తు చేసిన బాలీవుడ్ సుల్తాన్.. అవలీలగా రూ. 300 కోట్ల మార్కు దాటేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సాధించిన కలెక్షన్లు మొత్తం కలిపితే దాదాపు రూ. 345 కోట్లకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ఈద్ సెంటిమెంటుతో జూలై 7వ తేదీన విడుదల చేసిన ఈ సినిమా భారతదేశంలో రూ. 252.5 కోట్లు, విదేశాల్లో రూ. 92 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.

అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటివరకు మొదటి వారంలో ఏ బాలీవుడ్ సినిమా సాధించనంత మొత్తంలో కలెక్షన్లు సాధించింది. హీరోతో పాటు హీరోయిన్ అనుష్కా శర్మ కూడా రెజ్లర్ పాత్ర పోషించిన ఈ సినిమా దుబాయ్, పాకిస్థాన్, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి చాలా దేశాల్లో హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఆయా దేశాల్లో ఇప్పటివరకు ఏ హిందీ సినిమాకూ రానంత స్థాయిలో కలెక్షన్లు దీనికి వచ్చాయి.

Advertisement
 
Advertisement
Advertisement