క్రేజీ కాంబినేషన్‌? | Sukumar next film with Vijay devarakonda | Sakshi
Sakshi News home page

క్రేజీ కాంబినేషన్‌?

Nov 5 2018 2:38 AM | Updated on Nov 5 2018 2:38 AM

Sukumar next film with Vijay devarakonda - Sakshi

విజయ్‌ దేవరకొండ

టాలీవుడ్‌లో ప్రస్తుతం హీరో విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘రంగస్థలం’ వంటి భారీ విజయంతో మంచి ఊపులో ఉన్నారు సుకుమార్‌. ఇప్పుడు ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందా? అంటే ఫిల్మ్‌నగర్‌లో అవుననే సమాధానమే వినిపిస్తోంది. భరత్‌ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డియర్‌ కామ్రేడ్‌’, క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమాలతో బిజీగా ఉన్నారు విజయ్‌ దేవరకొండ.

వైజయంతీ మూవీస్‌లోనూ ఓ సినిమా చేయనున్నారాయన. మరోవైపు సుకుమార్‌ కూడా మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా చేయాల్సిఉంది. దీంతో విజయ్‌–సుకుమార్‌ కాంబినేషన్‌ ఇప్పట్లో కుదరదేమో? అని కొందరు అంటుంటే... లేదు లేదు.. త్వరలో ఈ సినిమా గురించి అధికారిక సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉందని మరికొందరి వాదన. దీనిపై  అధికారిక సమాచారం వెల్లడైతే కానీ గాసిప్‌లకు ఎండ్‌ కార్డ్‌ పడదని సినీ లవర్స్‌ అభిప్రాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement