ప్రభాస్ ఫ్యాన్స్కు డబుల్ ధమాకా! | Sujith to direct Prabhas | Sakshi
Sakshi News home page

ప్రభాస్ ఫ్యాన్స్కు డబుల్ ధమాకా!

Feb 10 2015 10:16 AM | Updated on Sep 2 2017 9:06 PM

ప్రభాస్ ఫ్యాన్స్కు డబుల్ ధమాకా!

ప్రభాస్ ఫ్యాన్స్కు డబుల్ ధమాకా!

రన్ రాజా రన్ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ సుజిత్తో ప్రభాష్ సినిమా చేయనున్నట్టు సినిమా వర్గాలు తెలిపాయి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త. ప్రభాస్ సినిమా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ ఏడాది డబుల్ ధమాకాతో రాబోతున్నాడు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ మరో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు. తదుపరి చిత్రాన్ని సుజిత్‌తో చేయడానికి ప్రభాస్  రెడీ అయినట్లు సమాచారం. 2013లో వచ్చిన మిర్చి సినిమా తరువాత ప్రభాస్ది చిత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదు. ప్రభాస్‌కు మిర్చిలాంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని ఇచ్చిన యువి బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కనుంది. 'రన్ రాజా రన్' ఫేం సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.  ముహర్తం కూడా ఈనెలలోనే ఖరారు కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి తారాగణం వివరాలు వెల్లడించలేదు. రాజమౌళి దర్శకత్వంలో రెండేళ్లుగా తెరకెక్కుతున్న 'బాహుబలి' ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధం అవుతుండడంతో ప్రభాస్  కొత్త సినిమాపై దృష్టి పెట్టాడు. అయితే బాహుబలి విడుదల తర్వాతే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక బాహుబలి సినిమా తొలి భాగాన్ని 2015 సమ్మర్లో విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement