‘జెస్సీ’ సినిమాపై సుధీర్‌ బాబు క్యూట్‌ ట్వీట్‌

Sudheer Babu Cute Tweet On U Turn Trailer - Sakshi

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘యూ టర్న్‌’ ట్రైలర్‌ శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాలో జర్నలిస్టుగా నటిస్తున్న సమంత ఓ కేసు విషయమై పోలీసు స్టేషన్‌కు వెళ్లడం, ఆ ప్రమాదాలకు సమంతే కారణం అంటూ పోలీసులు ప్రశ్నించడం వంటి సన్నివేశాలతో ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ ట్రైలర్‌ చూసిన నాగార్జున, నాగ చైతన్య, రకుల్‌ప్రీత్‌, అఖిల్‌, రానాలు సామ్‌కు ఆల్‌ ద బెస్ట్‌ చెప్పారు. పవన్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సెప్టెంబర్‌ 13వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో యూ టర్న్‌ విడుదల తేదీపై హీరో సుధీర్‌ బాబు ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. ‘  చాలా ఏళ్లు గడిచాయి. కానీ జెస్సీ, జెర్రీల మధ్య ఫైట్‌ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇద్దరూ సెప్టెంబరు 13న మళ్లీ ఒకసారి పోటీ పడబోతున్నారు. అయితే ఒక్క విషయం యూ టర్న్‌ ట్రైలర్‌ అదిరిపోయింది. సామ్‌.. నీ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ*.. సుధీర్‌ బాబు ట్వీట్‌ చేశాడు.

సామ్‌ ‘యూ టర్న్’ ‌, సుధీర్‌ బాబు ‘నన్ను దోచుకుందువటే’  సినిమాలు ఒకేరోజు విడుదల కానున్న నేపథ్యంలో సుధీర్‌ బాబు చేసిన క్యూట్‌ ట్వీట్‌కు సమంత కూడా అంతే క్యూట్‌గా స్పందించారు. ‘అయ్యో అదేం లేదు... మనిద్దరికీ ఆల్‌ ద బెస్ట్‌... థ్యాంక్యూ’  అంటూ ట్వీట్‌ చేశారు. కాగా ఏ మాయ చేశావే సినిమాలో సమంత సోదరుడిగా సుధీర్‌ బాబు నటించిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top