బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు | sudeep pailwan trailer launch | Sakshi
Sakshi News home page

బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు

Aug 23 2019 12:30 AM | Updated on Aug 23 2019 12:30 AM

sudeep pailwan trailer launch - Sakshi

సుదీప్‌

‘బలం ఉందన ్న అహంతో కొట్టేవాడు రౌడీ.. బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు’ అనే డైలాగులతో ప్రారంభమైన ‘పహిల్వాన్‌’ ట్రైలర్‌ సినిమాపై ఆసక్తి రేపుతోంది. ‘ఈగ’ ఫేమ్‌ సుదీప్‌ హీరోగా ఎస్‌. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘పహిల్వాన్‌’. ఈ సినిమాను అదే పేరుతో వారాహి చలన చిత్రం తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. సెప్టెంబర్‌ 12న సినిమాని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ‘‘యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో సుదీప్‌ రెజ్లర్‌ పాత్రలో కనిపిస్తారు.

చిరంజీవిగారు ఇటీవల విడుదల చేసిన ‘పహిల్వాన్‌’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. గురువారం విడుదలైన ట్రైలర్‌కి కూడా మంచి స్పందన వస్తోంది. ‘‘కె.జి.యఫ్‌’ని తెలుగులో రిలీజ్‌ చేసి ఘనవిజయం అందుకున్న వారాహి చలన చిత్రం సంస్థ ఇప్పుడు ‘పహిల్వాన్‌’ను ఘనంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి, ఆకాంక్ష సింగ్‌ కీలక పాత్రల్లో నటించారు’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాకి సంగీతం: అర్జున్‌ జన్యా, కెమెరా: కరుణాకర్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌. దేవరాజ్‌.

Advertisement
 
Advertisement
Advertisement