రాజమౌళి హింట్ ఇచ్చాడు..! | SS Rajamouli clarified about Baahubali part 3 | Sakshi
Sakshi News home page

రాజమౌళి హింట్ ఇచ్చాడు..!

May 4 2017 12:05 PM | Updated on Sep 5 2017 10:24 AM

రాజమౌళి హింట్ ఇచ్చాడు..!

రాజమౌళి హింట్ ఇచ్చాడు..!

బాహుబలి ప్రస్తుతం ఇడియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న భారీ చిత్రం. ఉత్తరాది సినిమాలకు కూడా షాక్ ఇస్తూ కలెక్షన్ల

బాహుబలి ప్రస్తుతం ఇడియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న భారీ చిత్రం. ఉత్తరాది సినిమాలకు కూడా షాక్ ఇస్తూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది బాహుబలి. రెండు భాగాలుగా రిలీజ్ అయిన ఈ సీరీస్ లో మరో భాగం ఉంటుందన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. అయితే ఈ విషయంలో యూనిట్ సభ్యులు ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు. ఒక సమయంలో బాహుబలి కథ ముగిసిందన్న రాజమౌళి, ఏదో ఒక రూపంలో బాహుబలి కొనసాగుతుందంటూ ట్విస్ట్ ఇచ్చాడు.

అయితే ప్రస్తుతం లండన్ లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న జక్కన్న, అక్కడి బ్రిటీష్ ఫిలిం ఇన్సిస్టిట్యూట్ ను సందర్శించాడు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో మాట్లాడిన రాజమౌళి మరోసారి బాహుబలి పార్ట్ 3 పై ఆశలు కలిగించాడు. బాహుబలి 3 ఉంటుందా అని విద్యార్థులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా..' బాహుబలి 3 కోసం కథ రెడీగా లేకుండా ఆడియన్స్ ను మోసం చేయలేను. అదే సమయంలో నన్ను ఎగ్జైట్ చేసే ఐడియాతో నాన్నగారు(విజయేంద్ర ప్రసాద్) కథ రెడీ చేస్తే బాహుబలి 3 గురించి ఆలొచిస్తా' అంటూ సమాధానం ఇచ్చాడు.

Advertisement
 
Advertisement
Advertisement