చిన్న హీరోలతో చేయనంటోంది | sruthi hassan no to small heros | Sakshi
Sakshi News home page

చిన్న హీరోలతో చేయనంటోంది

Dec 5 2015 12:14 PM | Updated on Apr 3 2019 6:23 PM

చిన్న హీరోలతో చేయనంటోంది - Sakshi

చిన్న హీరోలతో చేయనంటోంది

ఒకప్పుడు ఒక్క హిట్ వస్తే చాలని ఎదురుచూసిన శృతిహాసన్ ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్లలో టాప్ హీరోయిన్గా వెలిగిపోతోంది. వరుస సూపర్ హిట్స్తో టాప్ హీరోల సరసన నటిస్తూ భారీ రెమ్యూనరేషన్...

ఒకప్పుడు ఒక్క హిట్ వస్తే చాలని ఎదురుచూసిన శృతిహాసన్ ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్లలో టాప్ హీరోయిన్గా వెలిగిపోతోంది. వరుస సూపర్ హిట్స్తో టాప్ హీరోల సరసన నటిస్తూ భారీ రెమ్యూనరేషన్ కూడా అందుకుంటోంది. అయితే కెరీర్ స్టార్టింగ్లో క్యారెక్టర్ బాగుంటే ఏ హీరోతో అయినా నటించడానికి ఓకే చెప్పిన శృతి, ఇప్పుడు స్టార్ హీరోలతో మాత్రమే సినిమా చేస్తానంటోంది.

ముఖ్యంగా టాప్ హీరోల సినిమాలతోనే యమా బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. ఈ సమయంలో చిన్న హీరోలకు డేట్స్ ఇవ్వటం కుదరదని తెగేసి చెబుతోందట. శృతి క్రేజ్ను వాడుకోవటానికి కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నా అమ్మడు మాత్రం కరగటం లేదంటున్నారు దర్శక నిర్మాతలు. స్టార్ ఇమేజ్ ఉన్న సక్సెస్ ఫుల్ హీరోలతో అయితేనే సినిమా చేస్తానంటోంది శృతి. సౌత్ ఇండస్ట్రీలో కండిషన్లు పెడుతున్న శృతిహాసన్ బాలీవుడ్లో మాత్రం ఏ సినిమా వచ్చినా అంగీకరించేస్తోంది. ఎలాగైనా బాలీవుడ్ లో కూడా టాప్ హీరోయిన్ అనిపించుకోవటం కోసం తెగ తంటాలు పడుతోంది ఈ బ్యూటీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement