సమంతకు హీరోల స్పెషల్ విషెస్ | Special Wishes to Samantha | Sakshi
Sakshi News home page

సమంతకు హీరోల స్పెషల్ విషెస్

Apr 28 2016 5:39 PM | Updated on Sep 3 2017 10:58 PM

సమంతకు హీరోల స్పెషల్ విషెస్

సమంతకు హీరోల స్పెషల్ విషెస్

ముచ్చటగా మూడోసారి సమంతతో జత కడుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. పుట్టినరోజు సందర్భంగా ఆమెకు స్పెషల్ విషెస్ చెప్పారు.

ముచ్చటగా మూడోసారి సమంతతో జత కడుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. పుట్టినరోజు సందర్భంగా ఆమెకు స్పెషల్ విషెస్ చెప్పారు. మహేష్ తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం'లో సమంత కూడా ఓ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందే బ్రహ్మోత్సవం ఫస్ట్ లుక్ మోషన్ పిక్చర్ను ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసిన మహేష్.. గురువారం సమంత పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ మహేష్, సమంతలు కలిసి ఉన్న మరో పోస్టర్ను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కలర్ఫుల్గా ఉన్న ఆ పోస్టర్ చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు.

మరోవైపు త్రివిక్రమ్ డైరక్షన్లో నితిన్ సరసన హీరోయిన్గా 'అ..ఆ' సినిమాలో నటిస్తున్నారు సమంత. 'అనసూయా రామలింగం' అంటూ ఆమె పాత్ర పేరుతో విషెస్ చెప్తూ నితిన్ కూడా ఓ పోస్టర్ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అందరికీ థాంక్యూ చెబుతూనే ఈ రోజంతా గడిచిపోయేంత బిజీగా ఉంది సమంత.

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement