ఫిబ్రవరి 11న రజనీకాంత్‌ కూతురి పెళ్లి | Soundarya Rajinikanth to Get Married to on Feb 11 | Sakshi
Sakshi News home page

Jan 23 2019 11:11 AM | Updated on Jan 23 2019 11:11 AM

Soundarya Rajinikanth to Get Married to on Feb 11 - Sakshi

సూపర్‌ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ వివాహం ఫిబ్రవరి 11న జరగనుంది. ప్రముఖ వ్యాపార వేత్త, నటుడు విశాగన్ వనంగమూడిని సౌందర్య వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే రజనీ  కుంటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు. సౌందర్య, విశాగన్‌ ల నిశ్చితార్థం గత ఏడాది కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. వివాహం మాత్రం చెన్నైలోని ఓ హోటల్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఫిబ్రవరి 9 నుంచి మూడు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించనున్నారు. లతా రజనీకాంత్ ఇచ్చే పార్టీతో పెళ్లి వేడుకలు ప్రారంభకానున్నాయి. సౌందర్య అక్క, హీరో ధనుష్‌ భార్య ఐశ్వర్య స్వయంగా ప్రముఖులకు వివాహ ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు. గతంలో అశ్విన్‌ రామ్‌కుమార్‌ను వివాహం చేసుకున్న సౌందర్య 2017లో వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement