‘సైరా’కు సింగిల్‌ కార్డ్‌ | Sirivennela Sitharamasastry Single Card For Chiranjeevi Sye Raa | Sakshi
Sakshi News home page

Jan 29 2019 10:04 AM | Updated on Jan 29 2019 10:04 AM

Sirivennela Sitharamasastry Single Card For Chiranjeevi Sye Raa - Sakshi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలోని అన్ని పాటలను సీనియర్‌ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాస్తున్నారు.

ఈ విషయాన్ని హీరో మెగాస్టార్‌ చిరంజీవి స్వయంగా వెల్లడించారు. సీతారామశాస్త్రికి పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సందర్భంగా ఆయన్ను కలిసి చిరు ఈ విధంగా స్పందించారు. ‘సిరివెన్నెలగారు నేను హీరోగా నటించిన రుద్రవీణకు అద్భుతమైన పాటలు ఇచ్చారు. అప్పుడే ఆయనకు జాతీయ అవార్డు రావాల్సి ఉన్న ఒక్క ఓటుతో మిస్‌ అయ్యారు. ఇప్పుడు సైరాకు ఆయన అన్ని పాటలు రాస్తున్నారు. ఈ సినిమాకు కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుంది’ అన్నారు.ఔ

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారు. జగపతిబాబు, తమన్నా, సుధీప్‌, తమిళ నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు.

        సిరివెన్నెల సీతారామశాస్త్రికి పద్మశ్రీ ప్రకటించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపిన చిరంజీవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement