నాన్నకూ.. అక్కకూ సహాయం! | Shruti Haasan showers love to small sis Akshara Haasan | Sakshi
Sakshi News home page

నాన్నకూ.. అక్కకూ సహాయం!

May 8 2016 11:10 PM | Updated on Sep 3 2017 11:41 PM

నాన్నకూ.. అక్కకూ సహాయం!

నాన్నకూ.. అక్కకూ సహాయం!

కమల్‌హాసన్, శ్రుతీహాసన్ తండ్రీకూతుళ్లుగా ‘శభాష్ నాయుడు’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

కమల్‌హాసన్, శ్రుతీహాసన్ తండ్రీకూతుళ్లుగా ‘శభాష్ నాయుడు’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అక్షరాహాసన్ కూడా పని చేస్తున్నారు. అయితే కమల్, శ్రుతి ఆన్ స్క్రీన్ కనిపిస్తే, అక్షరాహాసన్ మాత్రం ఆఫ్ ద స్క్రీన్‌కి పరిమితమవుతారు. మలయాళ దర్శకుడు రాజీవ్ కుమార్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ  చిత్రం తెరకె క్కుతోంది. ఇప్పటికే పలు హిందీ చిత్రాలకు దర్శకత్వ విభాగంలో పనిచేసిన అనుభవం ఉన్న అక్షర ఈ సినిమాకు దర్శకత్వ విభాగంలో పనిచేయడానికి ఆసక్తి కనబర్చారట. దీనికి కమల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నాన్నా, అక్కా నటిస్తున్న సినిమాకి సహాయ దర్శకురాలిగా చేస్తున్నందుకు అక్షర సంబరపడిపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement