బాలీవుడ్‌ చిత్రంతో ఎంట్రీ ఇవ్వడం కూడా సరైన నిర్ణయం కాదు

Shruti Haasan Says She Would Marry Tamannaah Bhatia If She Were A Man - Sakshi

అలాంటి అవకాశం వస్తే తమన్నాను పెళ్లి చేసుకుంటాను అంటున్నారు కమల్‌ హాసన్‌ గారాల తనయ శృతి హాసన్‌. సౌత్‌ ఇండస్ట్రీలో తమన్నా, శృతి హాసన్‌ల మధ్య మంచి స్నేహం ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఏ మాత్రం అవకాశం వచ్చిన ఇద్దరు ఒకరి మీద ఒకరు ప్రశంసలు కురిపించుకుంటారు. తాజాగా జరిగిన ఓ సంఘటన వీరిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని మరో సారి చాటింది. ఓ చిట్‌చాట్‌ కార్యక్రమానికి హాజరైన శృతి హాసన్‌ను హోస్ట్‌ ‘ఒక వేళ మీరు అబ్బాయి ఐతే ఏ హీరోయిన్‌తో డేట్‌కు వెళ్తార’ని ప్రశ్నించారు.

అందుకు శృతి.. ‘తమన్నా. తనంటే నాకు చాలా ఇష్టం. ఒక వేళ నేనే గనక అబ్బాయినైతే.. తమన్నానే పెళ్లి చేసుకునే దాన్ని. తను చాలా మంచి అమ్మాయి. తనను అసలు వదిలిపెట్టే దాన్ని కాద’ని సమాధానమిచ్చారు. అంతేకాక బాలీవుడ్‌ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం వల్ల తనకు నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు శృతి. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘నా తొలి సినిమా గురించి నేను తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. అప్పటికి సినిమాల్లో నటించేందుకు నేనింక సిద్ధంగా లేను. ఇండస్ట్రీ గురించి కూడా పూర్తిగా తెలీదు. అదేకాక బాలీవుడ్‌ చిత్రంతో ఎంట్రీ ఇవ్వడం కూడా సరైన నిర్ణయం కాదన్నా’రు శృతి హాసన్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top