సాహో.. డ్యూయల్ కాదు సింగిలే..! | shraddha kapoor on duel role in sahoo | Sakshi
Sakshi News home page

సాహో.. డ్యూయల్ కాదు సింగిలే..!

Sep 14 2017 1:07 PM | Updated on Jul 17 2019 10:14 AM

సాహో.. డ్యూయల్ కాదు సింగిలే..! - Sakshi

సాహో.. డ్యూయల్ కాదు సింగిలే..!

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సాహో సినిమాపై రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సాహో సినిమాపై రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఈ సినిమాపై జాతీయ స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాదు ఎక్కువగా బాలీవుడ్ నటులే ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తుండటం కూడా సినిమా మీద అంచనాలు మరింత పెంచుతోంది.

ముఖ్యంగా హీరోయిన్ గా నటిస్తున్న శ్రద్ధాకపూర్ క్యారెక్టర్ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా శ్రద్ధా డ్యూయల్ రోల్ లో నటిస్తుందని అందులో ఒకటి నెగెటివ్ క్యారెక్టర్ అన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ రూమర్స్ కు చెక్ పెడుతూ తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చింది శ్రద్ధా. సాహో సినిమాలో తాను ఒక్క పాత్రే చేస్తున్నట్టుగా చెప్పిన శ్రద్ధా పాత్రలోనే డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలపింది. అంతేకాదు ఈ సినిమాలో తాను యాక్షన్ ఎపిసోడ్స్ లోనూ నటిస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement