పెళ్లి పాటల ఆల్బమ్‌లో... | Shilpa Shetty Kundra to do a music video on wedding songs | Sakshi
Sakshi News home page

పెళ్లి పాటల ఆల్బమ్‌లో...

Oct 6 2015 10:58 PM | Updated on Sep 3 2017 10:32 AM

పెళ్లి పాటల ఆల్బమ్‌లో...

పెళ్లి పాటల ఆల్బమ్‌లో...

శిల్పాశెట్టి ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను పెళ్లి చేసుకుని నటనకు దూరమయ్యరు.

శిల్పాశెట్టి ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను పెళ్లి చేసుకుని నటనకు దూరమయ్యరు. అటుపై తన భర్త రాజ్‌కుంద్రా వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నారు. అయినా సరే బాలీవుడ్‌లో ట్రెండ్‌ను ఓ కంట కనిపెడుతూనే ఉన్నారామె. ఇటీవలే బాలీవుడ్‌లో అగ్రతారలు మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
 
  ఈ కొత్త ట్రెండ్ శిల్పాశెట్టిని ఆకట్టుకుంది. అదే టైమ్‌లో ఆమెనో ఆఫర్ వరించింది. హృతిక్ రోషన్, సోనమ్‌కపూర్‌లతో ‘ఆషికి-2’ హిట్ సాంగ్ ‘ధీరే ధీరే’ పాటను రీమిక్స్ చేసిన నృత్య దర్శకుడు అహ్మద్ ఖాన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ లో హిట్ అయిన పెళ్లి పాటలను తీసుకుని ఓ ఆల్బమ్‌లా చేయాలని శిల్పా శెట్టిని సంప్రదించారట.
 
 ఈ కాన్సెప్ట్ విని శిల్పా ఇంప్రెస్ అయ్యారట. ‘‘ఇందులో ఎంపిక చేసిన పాటలు అన్నీ బాగుంటే గనక వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తాను. అయినా నాకు మొదటి నుంచి ఐటెమ్ సాంగ్స్ చేయడమంటే చాలా ఆసక్తి. స్టయిలిష్‌గా కొరియోగ్రాఫ్ చేసే పాటలకు డాన్స్ చేయడమంటే నాకూ ఇష్టమే. అసలు షారుక్ ఖాన్‌తో ‘దిల్‌సే’ లోని ‘ఛయ్య..ఛయ్య’ పాటను నేను చేయాల్సి ఉంది. కానీ నాకు అప్పుడున్న కమిట్‌మెంట్స్ వల్ల చేయడానికి కుదర్లేదు’’ అని శిల్పాశెట్టి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement