స్టార్‌ హీరోయిన్‌ రెస్టారెంట్‌లో న్యూడిల్స్‌ ధర ఎంతో తెలిస్తే.. | Shilpa shetty bastian Restaurant Bill Again Trend In Social Media | Sakshi
Sakshi News home page

స్టార్‌ హీరోయిన్‌ రెస్టారెంట్‌లో న్యూడిల్స్‌ ధర ఎంతో తెలిస్తే..

Apr 5 2026 8:56 AM | Updated on Apr 5 2026 8:57 AM

Shilpa shetty bastian Restaurant Bill Again Trend In Social Media

ముంబైలో అత్యంత ఖరీదైన రెస్టారెంట్‌ల జాబితాలో శిల్పాశెట్టి ‘బాస్టియన్‌’  ఒకటనే విషయం తెలిసిందే. అక్కడి ఫుడ్‌ మెనూ ధరల గురించి తరుచుగా నెట్టింట చర్చ జరుగుతూనే ఉంటుంది.  బాస్టియన్‌లో ఫుడ్‌ తిన్న కొందరు తమ బిల్లును  గత ఏడాది నుంచి సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తూనే ఉన్నారు. అందులోని ధరలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. తరుచుగా ఈ బిల్లు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటుంది.

ముంబైలోని ఒక ప్రీమియం ఫైన్-డైనింగ్ రెస్టారెంట్‌గా బాస్టియన్‌కు గుర్తింపు ఉంది. ఇక్కడ విలాసవంతమైన సౌకర్యాలతో పాటు రుచికరమైన సీఫుడ్ కూడా దొరుకుతుంది. ఎంతో ఆకర్షణీయమైన వాతావరణం ఉండటం వల్ల చాలామంది సెలబ్రిటీలు, వ్యాపారావేత్తలు అక్కడికి వెళ్తుంటారు. విలాసవంతమైన ప్రదేశం కాబట్టి అక్కడి ఫుడ్‌ ధరలు కూడా ప్రీమియంగానే ఉంటాయి.  బాస్టియన్‌లో ఫుడ్‌ తిన్న కొందరు తమ బిల్లును షేర్‌ చేశారు. నలుగురికి కలిపి రూ. 21,731 అయినట్లు తెలిపారు. చికెన్‌ న్యూడిల్స్‌ ధర రూ. 950 ఉండటం చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ ధర ఏకంగా రూ. 1450 ఉండటంతో మాటలు రావడం లేదంటూ కామెంట్‌ చేస్తున్నారు. అయితే, ఈ ధరలు అన్నీ కూడా ఏడాది క్రితం నాటివి కావడం విశేషం. ప్రస్తుతం ఇంకాస్త ఎక్కువే ఉండొచ్చని అంటున్నారు.

బాస్టియన్‌ రెస్టరంట్ ఒక్కరోజులో రూ.2-3 కోట్ల టర్నోవర్‌ చేస్తుందని అంచనా ఉంది. సాధారణ రోజుల్లో రూ.2 కోట్లు, వీకెండ్‌లో రూ.3 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా ఉంది.  సుమారు 1400 మందికి పైగానే అతిథులు అక్కడ స్టే చేయొచ్చట. ఒకేసారి 700 మంది భోజనం చేసేలా వీలు ఉందని చెబుతారు. 

Advertisement
 
Advertisement
Advertisement