సమస్యల నుంచి బయటపడ్డా | She turned to the problems of life | Sakshi
Sakshi News home page

సమస్యల నుంచి బయటపడ్డా

Jun 7 2014 12:07 AM | Updated on Sep 2 2017 8:24 AM

సమస్యల నుంచి బయటపడ్డా

సమస్యల నుంచి బయటపడ్డా

ఇంటగెలిచి రచ్చ గెలవాలంటారు. నటి అంజలి లాంటి కొందరు రచ్చ గెలిచి ఆ తర్వాతే ఇంట గెలిచే ప్రయత్నంలో పడుతుంటారు. అచ్చ తెలుగు చిన్నది అంజలి కట్రదు తమిళ్ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైంది.

ఇంటగెలిచి రచ్చ గెలవాలంటారు. నటి అంజలి లాంటి కొందరు రచ్చ గెలిచి ఆ తర్వాతే ఇంట గెలిచే ప్రయత్నంలో పడుతుంటారు. అచ్చ తెలుగు చిన్నది అంజలి కట్రదు తమిళ్ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైంది. తొలి చిత్రంతోనే నటిగా పేరు తెచ్చుకుంది. అంగాడి తెరు చిత్రం అంజలికి సక్సెస్ రుచిని చూపించింది. ఆ తర్వాత వరుసగా ఎంగేయుం ఎప్పోదుం, కలగలప్పు తది తర చిత్రాలు పాపులర్ చేశాయి. నటిగా మంచి స్థాయికి చేరుకుంటున్న దశలో పిన్నితో ఏర్పడిన మనస్పర్థలు, అనూహ్యంగా హైదరాబాద్ వెళ్లిపోవడం, అక్కడి నుంచి పిన్నిపై ఆరోపణలు గుప్పించ డం, కోర్టులు, కేసులు ఇలా అంజలి జీవితం సమస్యల మయంగా మారింది.
 
 అదే సమయంలో ఈ అమ్మ డు తెలుగు చిత్ర పరిశ్రమలో పాగా వేయాలని చూసిం ది. వెంకటేశ్ సరసన నటించిన సీతమ్మ వాకి ట్లో సిరి మల్లె చెట్టు చిత్రం మంచి విజ యాన్ని సాధించడంతో మరిన్ని అవకాశాలు వస్తాయని ఊహించుకుంది. తల చింది ఒక్కటి జరిగింది ఒక్కటి అన్న ట్లు అంజలి పరిస్థితి తయారైంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం తర్వాత వెంకటేష్‌తో జోడి కట్టిన మసాలా చిత్రం ఆమె ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో ఈ ముద్దుగుమ్మ మళ్లీ తమిళ చిత్ర పరిశ్రమపై దృష్టి సారించింది. ఆమె పేర్కొంటూ ప్రస్తు తం తన సమస్యలు పూరిగా సమసిపోయాయని పేర్కొంది.
 
 కన్నడ చిత్ర రంగంలోకి కూడా ప్రవేశించానని, అక్కడే ఇప్పుడు పునీత్ రాజ్‌కుమార్ సరసన ఒక చిత్రం చేస్తున్నట్లు తెలిపింది. తాను నటించడాన్ని ఎవరూ అడ్డుకోలేరని వెల్లడించింది. తాను తప్పు చేయలేదన్న విషయం తమిళ పరిశ్రమకు, ప్రేక్షకులకు తెలుసని తెలిపింది. వారి ఆదరణ తనకు తప్పకుండా ఉంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఈ బ్యూ టీ తమిళంలో జయం రవి సరసన నూతన చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
 
అంజలిని కోర్టు కీడుస్తా
నటి అంజలి తమిళంలో మళ్లీ నటించడానికి సిద్ధం అవుతుంటే మరోపక్క దర్శకుడు కలైంజన్ ఆమెను కోర్టుకీడుస్తానని శపథం చేయడం వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ఈయన స్వీయ దర్శకత్వంలో హీరోగా ఊర చుట్రి పురాణం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో అంజలి హీరోయిన్. కొన్ని రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం అంజలి కారణంగా నిలి చిపోయింది. అప్పట్లో అంజలి ఈ నట దర్శకుడిపై కూడా ఆరోపణలు గుప్పించింది. ఈ వ్యవహారంలో కలైంజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టులో పరువు నష్టం దావా కూడా వేశారు.
 
ఇటీవల ఇతర చిత్రాల లోను నటిస్తున్న కలైం జన్ ఇటీవల కనవు తొళిర్‌శాలై చిత్రానికి డబ్బింగ్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయనను తన ఊర్ చుట్టి పురాణం చిత్రం గురించి అడ గ్గా చిత్రాన్ని ఏ ముహూర్తాన మొదలెట్టానో ఏమో నటి అంజలి కోసం ఆ మధ్య ఊరూరా తిరిగాను అని అన్నారు. అంజలి మళ్లీ తమిళ చిత్రాల్లో నటించడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం గురించి ప్రస్తావించగా ఆమె తన చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాతే ఇతర చిత్రాల్లో నటించాలని తెలిపారు.
 
ఈ విషయమై నిర్మాతల సంఘం, నటీనటుల సం ఘం, ఫిలించాంబర్, గిల్డ్, ఫెఫ్సీ, దర్శకుల సం ఘంలో ఫిర్యాదు చేశానని తెలిపారు. తన సమస్య పరిష్కారం కాకుండా అం జలి ఏ భాషలో నటించిన చిత్రాన్నైనా విడుదలకాకుండా ఆమెను కోర్టుకీడ్చి అడ్డుకుంటానని కలైంజన్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement