రజనీ స్టయిల్‌కి...మెస్మరైజ్ అయిపోయా : షారుక్‌ఖాన్ | Shahrukh Khan, Rajinikanth, Deepika Padukone release Kochadaiiyan music | Sakshi
Sakshi News home page

రజనీ స్టయిల్‌కి...మెస్మరైజ్ అయిపోయా : షారుక్‌ఖాన్

Mar 10 2014 12:52 AM | Updated on Sep 2 2017 4:31 AM

రజనీ స్టయిల్‌కి...మెస్మరైజ్ అయిపోయా : షారుక్‌ఖాన్

రజనీ స్టయిల్‌కి...మెస్మరైజ్ అయిపోయా : షారుక్‌ఖాన్

‘‘నేను రజనీకాంత్‌కి వీరాభిమానిని. తెరపై రజనీ స్టయిల్ చూసి మెస్మరైజ్ అయిపోయా. ఇరవై ఏళ్ళక్రితం ఓ షూటింగ్ నిమిత్తం ఆయన ముంబై వచ్చినప్పుడు సిగరెట్ కాల్చే స్టయిల్

 ‘‘నేను రజనీకాంత్‌కి వీరాభిమానిని. తెరపై రజనీ స్టయిల్ చూసి మెస్మరైజ్ అయిపోయా. ఇరవై ఏళ్ళక్రితం ఓ షూటింగ్ నిమిత్తం ఆయన ముంబై వచ్చినప్పుడు సిగరెట్ కాల్చే స్టయిల్ స్వయంగా చూశాను. ఆయనలా స్టయిల్‌గా కాల్చాలని చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యాను’’ అని షారుక్‌ఖాన్ చెప్పారు. రజనీకాంత్, దీపికా పదుకునే జంటగా సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కోచడయాన్’ (తెలుగులో విక్రమసింహా). ఏఆర్ రెహమాన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఆదివారం చెన్నైలో షారుక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ- ‘నాకు రాజుల కథలంటే చిన్నప్పటినుంచీ ఇష్టం. ఆ తరహా కథతో సినిమా చేయాలన్న నా కోరిక ఈ చిత్రంతో నెరవేరింది. నా అభిమానులని కచ్చితంగా అలరించే సినిమా ఇది’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దీపికా పదుకునే, ఏఆర్‌రెహమాన్, బాలచందర్, శంకర్, శరత్‌కుమార్, వెరముత్తు, కేయస్ రవికుమార్, ఆది పినిశెట్టి, నాజర్, రసూల్, సౌందర్య, ఏవీయమ్ శరవణన్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement