28 ఏళ్ల తర్వాత కాలేజీకెళ్లిన టాప్ హీరో | Shah Rukh Khan receives graduation degree after 28 years | Sakshi
Sakshi News home page

28 ఏళ్ల తర్వాత కాలేజీకెళ్లిన టాప్ హీరో

Feb 16 2016 8:52 PM | Updated on Apr 3 2019 6:23 PM

28 ఏళ్ల తర్వాత కాలేజీకెళ్లిన టాప్ హీరో - Sakshi

28 ఏళ్ల తర్వాత కాలేజీకెళ్లిన టాప్ హీరో

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ డిగ్రీ పట్టాను ఎట్టకేలకు కలెక్ట్ చేసుకున్నాడు.

ముంబయి: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ డిగ్రీ పట్టాను ఎట్టకేలకు కలెక్ట్ చేసుకున్నాడు.  కింగ్ ఖాన్ ఇప్పుడు డిగ్రీ పట్టా తీసుకోవడం ఏంటనుకుంటున్నారా.. అలాగని ఆయన ఇప్పుడేదో కాలేజీకి వెళ్లి చదివి తెచ్చుకున్న డిగ్రీ అంతకన్నా కాదు. యశ్ రాజ్ ఫిల్మ్ 'ఫ్యాన్' మూవీలోని సాంగ్ లాంచ్ చేయడానికి నేడు రాజధాని న్యూఢిల్లీకి షారుక్ వెళ్లారు. పనిలో పనిగా తాను గ్రాడ్యుయేషన్ చదివిన కాలేజీకి వెళ్లాడు. 28 ఏళ్ల తర్వాత కాలేజీ గడప తొక్కిన షారుక్ తాను చదివిన హంసరాజ్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టాను తీసుకున్నాడు.

యాబై ఏళ్ల వయసులో డిగ్రీ పట్టా తీసుకోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ సందర్భంగా షారుక్ తన కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నాడు. '1988లో ఈ కాలేజీ నుంచి వెళ్లిపోయాను. ఇప్పుడు నేను ఓ విషయాన్ని మిస్సవుతున్నాను. నా పిల్లలు ఈరోజు నాతో పాటు లేరు. వారు గనక వచ్చి ఉంటే నేను చదివిన కాలేజీ మొత్తం తిప్పి వారికి చూపించేవాడిని' అని షారుక్ పేర్కొన్నాడు.

హంసరాజ్ కాలేజీ ప్రిన్సిపాల్ రమా శర్మ మాట్లాడుతూ... షారుక్ లాంటి సూపర్ స్టార్ మన కాలేజీలో చదివినందుకు చాలా గర్వంగా ఉందన్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆయనకు డిగ్రీ ప్రదానం చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. షారుక్ స్వస్థలం ఢిల్లీ అన్న విషయం అందరికీ తెలిసిందే. సినిమాల కోసం ముంబై నగరానికి మకాం మార్చి అక్కడే ఉండిపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement