breaking news
Hansraj College
-
'షారూఖ్ ఖాన్ ను అడ్డుకోలేదు'
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ ను తాము అడ్డుకోలేదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) తెలిపింది. షారూఖ్ కు అడ్డుకునేందుకు ప్రయత్నించలేదని, ఆయనకు వ్యతిరేకంగా ఎటువంటి ఆందోళనలు నిర్వహించలేదని వెల్లడించింది. ఢిల్లీలోని హన్స్ రాజ్ కాలేజీ నుంచి షారూఖ్ మంగళవారం డిగ్రీ పట్టా తీసుకున్నారు. డిగ్రీ పూర్తి చేసిన 28 ఏళ్ల తర్వాత పట్టా అందుకున్నారు. యశ్ రాజ్ బ్యానర్ లో వస్తున్న 'ఫ్యాన్' సినిమా పాట విడుదల సందర్భంగా హన్స్ రాజ్ కాలేజీకి వచ్చిన షారూఖ్ కు వ్యతిరేకంగా కాలేజీ బయట ఏబీవీపీ ఆందోళన చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇందులో వాస్తవం లేదని హన్స్ రాజ్ కాలేజీ ఏబీవీపీ అధ్యక్షుడు ఇష్విందర్ పాల్ సింగ్ అన్నారు. కొంతమంది తాగుబోతులు గలాబా సృష్టించారని, దీంతో తమకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. 'మేము ఎటువంటి నిరసనలు చేపట్టలేదు. అవన్నీ ఊహాగానాలు. కాలేజీ బయట కొంతమంది తాగుబోతులు అనుచితంగా ప్రవర్తించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. క్యాంపస్ ప్రశాంతంగా ఉంది. ఏబీవీపీ ఎటువంటి సమస్యలు సృష్టించలేద'ని ఇష్విందర్ తెలిపారు. అయితే షారూఖ్ ఖాన్ రావడంతో భారీగా అభిమానులు తరలివచ్చారని, వారిని నియంత్రించడం తమకు చాలా కష్టమైందని కృష్ణకుమార్ అనే పోలీసు వెల్లడించారు. తగినవిధంగా సెక్యురిటీ ఏర్పాట్లు చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పారు. -
28 ఏళ్ల తర్వాత కాలేజీకెళ్లిన టాప్ హీరో
ముంబయి: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ డిగ్రీ పట్టాను ఎట్టకేలకు కలెక్ట్ చేసుకున్నాడు. కింగ్ ఖాన్ ఇప్పుడు డిగ్రీ పట్టా తీసుకోవడం ఏంటనుకుంటున్నారా.. అలాగని ఆయన ఇప్పుడేదో కాలేజీకి వెళ్లి చదివి తెచ్చుకున్న డిగ్రీ అంతకన్నా కాదు. యశ్ రాజ్ ఫిల్మ్ 'ఫ్యాన్' మూవీలోని సాంగ్ లాంచ్ చేయడానికి నేడు రాజధాని న్యూఢిల్లీకి షారుక్ వెళ్లారు. పనిలో పనిగా తాను గ్రాడ్యుయేషన్ చదివిన కాలేజీకి వెళ్లాడు. 28 ఏళ్ల తర్వాత కాలేజీ గడప తొక్కిన షారుక్ తాను చదివిన హంసరాజ్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టాను తీసుకున్నాడు. యాబై ఏళ్ల వయసులో డిగ్రీ పట్టా తీసుకోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ సందర్భంగా షారుక్ తన కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నాడు. '1988లో ఈ కాలేజీ నుంచి వెళ్లిపోయాను. ఇప్పుడు నేను ఓ విషయాన్ని మిస్సవుతున్నాను. నా పిల్లలు ఈరోజు నాతో పాటు లేరు. వారు గనక వచ్చి ఉంటే నేను చదివిన కాలేజీ మొత్తం తిప్పి వారికి చూపించేవాడిని' అని షారుక్ పేర్కొన్నాడు. హంసరాజ్ కాలేజీ ప్రిన్సిపాల్ రమా శర్మ మాట్లాడుతూ... షారుక్ లాంటి సూపర్ స్టార్ మన కాలేజీలో చదివినందుకు చాలా గర్వంగా ఉందన్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆయనకు డిగ్రీ ప్రదానం చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. షారుక్ స్వస్థలం ఢిల్లీ అన్న విషయం అందరికీ తెలిసిందే. సినిమాల కోసం ముంబై నగరానికి మకాం మార్చి అక్కడే ఉండిపోయాడు.


