బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ: కన్ఫర్మ్‌ చేసిన యాంకర్‌

Savithri Confirms Her Entry Into Bigg Boss Telugu 3 House - Sakshi

హైదరాబాద్‌: ప్రముఖ టీవీ యాంకర్‌ సావిత్రి బిగ్‌బాస్‌-3లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ మేరకు ఆమె సోషల్‌ మీడియాలో కన్ఫర్మ్‌ చేసినట్టు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సావిత్ర పోస్టు చేసిన ఓ వీడియోలో తాను బిగ్‌బాస్‌-3లో పాల్గొంటున్నట్టు క్లారిటీ ఇచ్చారని సమాచారం. అయితే, ప్రస్తుతం ఆ పోస్ట్‌ను సావిత్రి తొలగించినట్టు తెలుస్తోంది. ఓ టీవీ చానెల్‌లో ‘సావిత్రక్క’గా ఫేమస్‌ అయిన శివజ్యోతి బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు గత కొన్నాళ్లుగా కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. 


యాంకర్‌ సావిత్రి

కంటెస్టెంట్స్‌ వీరేనా..!
నాగార్జున హోస్ట్‌గా నిర్వహిస్తున్న బిగ్‌బాస్‌-3పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. వందరోజులపాటు సాగనున్న బిగ్‌బాస్‌-3 షోలో మొత్తం 15మంది కంటెస్టెంట్స్‌ పాల్గొననున్నారు. ఇప్పటికే బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఎవరెవరు ఉండబోతునన్నారన్న దానిపై అనేక రకాల కథనాలు మీడియాలో, సోషల్‌ మీడియాలో వస్తున్నాయి. ఈ కథనాల ప్రకారం చూసుకుంటే.. ఈసారి షోలో సావిత్రితోపాటు ప్రముఖ యాంకర్‌ శ్రీముఖి, నటి హేమ, వరుణ్‌ సందేశ్‌, ఆయన భార్య వితికా షేరు, జర్నలిస్ట్‌ జాఫర్‌, ఉయ్యాల జంపాల ఫేమ్‌ పునర్నవి భూపాలం, నటి హిమజ, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ తదితరులు పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఆదివారం నుంచి ప్రారంభం కాబోతున్న ఈ షోలో ఎవరెవరు పాల్గొనబోతున్నది త్వరలోనే స్పష్టం కానుంది. ఇక, ఈ షో నిర్వాహకులు తమతో అభ్యంతరకరంగా ప్రవర్తించి.. లైంగికంగా వేధించారని జర్నలిస్ట్‌ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా ఆరోపించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

26-07-2019
Jul 26, 2019, 18:29 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ చేస్తున్నది ఎవరైనా ఉన్నారు అంటే అది బాబా భాస్కర్‌,జాఫర్‌లు మాత్రమే. వీరిద్దరి ద్వయం చేసే చేష్టలు,...
25-07-2019
Jul 25, 2019, 23:19 IST
వంట గదిలో వచ్చిన గొడవ ఇంకా చల్లారనే లేదు.. గురువారం నాటి ఎపిసోడ్‌లో ఇంకో మూడు గొడవలు వచ్చి పడ్డాయి. హేమ-రాహుల్‌...
23-07-2019
Jul 23, 2019, 23:03 IST
నామినేషన్‌లో ప్రక్రియలో మొదటి కంటెస్టెంట్‌గా ఎంటరైన రాహుల్‌కు.. నామినేషన్‌ నుంచి తప్పించుకునేందుకు మొదట అవకాశం వచ్చింది. ఫస్ట్‌బెల్‌ మోగగానే.. శివజ్యోతి(తీన్మార్‌ సావిత్రి)ని తనకు బదులుగా...
23-07-2019
Jul 23, 2019, 17:33 IST
అడుగుపెట్టిన మొదటిరోజే నామినేషన్స్‌ ప్రక్రియ మొదలుపెట్టిన బిగ్‌బాస్‌.. కంటెస్టెంట్స్‌ మధ్య చిచ్చును పెట్టాడు. మొదటగా ఇంట్లోకి ప్రవేశించిన శివజ్యోతి, రవికృష్ణ,...
22-07-2019
Jul 22, 2019, 22:49 IST
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ మొదలైపోయింది. పదిహేను మంది సెలబ్రెటీలు హౌస్‌లో అడుగుపెట్టారు. చివరగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్‌...
22-07-2019
Jul 22, 2019, 18:29 IST
నాలుగు గోడల మధ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండే బిగ్‌బాస్‌ షో తనకు నచ్చదని ఒకానొక సందర్భంలో కింగ్‌ నాగార్జున...
21-07-2019
Jul 21, 2019, 16:46 IST
ఓ వైపు వివాదాలు.. మరోవైపు నినాదాలు.. ఇంకోవైపు ధర్నాలు, నిరసనలు.. బిగ్‌బాస్‌ను చుట్టుముట్టాయి. మూడో సీజన్‌ను మొదలుపెట్టకముందే తెలుగు రాష్ట్రాల్లో...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top