'యంగ్ టైగర్కు జోడీగా నిత్య, సమంత' | Samantha, Nithya team up with NTR in 'Janatha Garage' | Sakshi
Sakshi News home page

'యంగ్ టైగర్కు జోడీగా నిత్య, సమంత'

Feb 16 2016 7:27 PM | Updated on Apr 3 2019 9:17 PM

'యంగ్ టైగర్కు జోడీగా నిత్య, సమంత' - Sakshi

'యంగ్ టైగర్కు జోడీగా నిత్య, సమంత'

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సమంత, నిత్యమీనన్‌తో ఆడిపాడనున్నారు. మిర్చి, శ్రీమంతుడులాంటి హిట్ చిత్రాలు తీసిన ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించనున్న జనతా గ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్, సమంత, నిత్యమీనన్ల జోడి నటించనుంది.

చెన్నై: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సమంత, నిత్యమీనన్‌తో ఆడిపాడనున్నారు. మిర్చి, శ్రీమంతుడులాంటి హిట్ చిత్రాలు తీసిన ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించనున్న జనతా గ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్, సమంత, నిత్యమీనన్ లు నటించనున్నారు . ఈ సినిమా వచ్చే వారం నుంచి హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో షూటింగ్ జరుపుకోనుంది.

ఈ సినిమాకోసం తొలుత పలువురు పేర్లను పరిశీలించినప్పటికీ చివరకు సమంత, నిత్యమీనన్‌ల పేర్లను ఖరారు చేసినట్టు సమాచారం. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఎన్‌టీఆర్‌కు అంకుల్‌గా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇక దేవయాని, ఉన్ని ముకుందన్లు ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ప్రధాన పాత్రల చుట్టే కథ తిరిగే ఈ చిత్రానికి దేవీశ్రీ సంగీతం అందించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement