రెండు పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుందట | Samantha dual roll | Sakshi
Sakshi News home page

రెండు పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుందట

Aug 4 2015 8:54 AM | Updated on Sep 3 2017 6:43 AM

రెండు పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుందట

రెండు పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుందట

కోలీవుడ్‌లో మోస్ట్‌వాంటెడ్ క్రేజీ హీరోయిన్ సమంత అనడం అతిశయోక్తి కాదేమో.

కోలీవుడ్‌లో మోస్ట్‌వాంటెడ్ క్రేజీ హీరోయిన్ సమంత అనడం అతిశయోక్తి కాదేమో.ప్రస్తుతం ప్రముఖ హీరోలందరితోనూ నటిస్తున్న ఏకైక నటి సమంతనే. విజయ్ తాజా చిత్రంలో హీరోయిన్ ఈ బ్యూటీనే. దనుష్ వీఐపీ2లో నటిస్తున్నారు. ఇక విక్రమ్ సరసన నటిస్తున్న పత్తుండ్రదుకుళ్ చిత్రాన్ని ఇటీవలే పూర్తి చేశారు.
 
 విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో ఈ చెన్నై సుందరి తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. పత్తుఎండ్రదుకుళ్ చిత్రం తనకు ప్రత్యేకం అంటూ ఆది నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. మరో విషయం ఏమిటంటే సమంత తొలిసారిగా తన రెండు పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారట. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
 
పత్తుఎండ్రదుకుళ్ చిత్రంలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పే అవకాశం కల్పించిన దర్శకుడు విజయ్ మిల్టన్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు అన్నారు. ఇది తనకు సరికొత్త అనుభవం అంటున్న సమంత ఈ చిత్రంపై చాలా అంచనాలు పెట్టుకున్నారని తెలుస్తోంది. కాగా పత్తుఎండ్రదుకుళ్ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement