ఫ్యామిలీ మ్యాన్‌తో సమంత!

Samantha To Act in The Family Man Web Series - Sakshi

టాలీవుడ్ లో టాప్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న భామ సమంత. పెళ్లి తరువాత కూడా వరుస సినిమాలతో అలరిస్తున్న ఈ బ్యూటీ త్వరలోనే డిజిటల్‌ రంగంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. వెబ్‌ సిరీస్‌ల ట్రెండ్‌ పెరుగుతుండటంతో స్టార్స్‌ కూడా వీటిలో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. బడ్జెట్‌ పరంగానూ సినిమాలకు ధీటు వెబ్‌ సిరీస్‌లను రూపొందిస్తున్నారు.

ఇటీవల రాజ్‌ డీకే ల దర్శకత్వంలో మనోజ్‌ బాజ్‌పాయ్‌, సందీప్‌ కిషన్‌, ప్రియమణి ప్రధాన పాత్రలలో రూపొందించిన వెబ్‌ సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’. ఇటీవల విడుదలైన ఈ సిరీస్‌కు మంచి రెస్సాన్స్‌ రావటంతో మరో సీజన్‌ను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. రెండో సీజన్‌లో స్టార్ హీరోయిన్‌ సమంత కీలక పాత్రలో కనిపించనున్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top