కిక్ సీక్వెల్ తీస్తున్న సల్మాన్? | Salman's 'Kick' to get a sequel soon? | Sakshi
Sakshi News home page

కిక్ సీక్వెల్ తీస్తున్న సల్మాన్?

Nov 20 2014 5:18 PM | Updated on Sep 2 2017 4:49 PM

కిక్ సీక్వెల్ తీస్తున్న సల్మాన్?

కిక్ సీక్వెల్ తీస్తున్న సల్మాన్?

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ఖాన్ ఇప్పటివరకు తన 'దబాంగ్' సినిమా తప్ప మరి దేనికీ సీక్వెల్ తీయలేదు. కానీ త్వరలోనే 'కిక్' సినిమా సీక్వెల్ తీయబోతున్నారని సమాచారం.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ఖాన్ ఇప్పటివరకు తన 'దబాంగ్' సినిమా తప్ప మరి దేనికీ సీక్వెల్ తీయలేదు. కానీ త్వరలోనే 'కిక్' సినిమా సీక్వెల్ తీయబోతున్నారని సమాచారం. తెలుగులో సూపర్హిట్ అయిన కిక్ సినిమాను హిందీలో రీమేక్ చేసిన సల్లూభాయ్.. ఇప్పుడు సాజిద్ నడియాడ్వాలా దర్శకత్వంలో దానికి సీక్వెల్ చేయాలనుకుంటున్నారట. ఇప్పటివరకు సల్మాన్ నటించిన సినిమాలన్నింటిలోకీ కిక్ అత్యధిక వసూళ్లు సాధించింది. ఇప్పటివరకు అది దాదాపు రూ. 234 కోట్లు వసూలు చేసినట్లు బాక్సాఫీసు వర్గాలు చెబుతున్నాయి.

ఇంతకుముందు సల్మాన్ నటించిన 'ఏక్ థా టైగర్' 188 కోట్లు వసూలు చేయగా, దాన్ని కూడా కిక్ ఓ తన్ను తన్నింది. దాంతో సాజిద్ స్నేహితులు, పంపిణీదారులు అందరూ కూడా దాని సీక్వెల్ తీయాల్సిందిగా చెబుతున్నారు. ఇప్పటికైతే నిర్మాతగా సాజిద్కు చేతినిండా సినిమాలున్నాయి. సల్మాన్ స్టార్ పవర్ కారణంగా కిక్ అనుకున్నదాని కంటే చాలా ఎక్కువ వసూళ్లు సాధించిందని, సీక్వెల్ ఎప్పుడు చేస్తామో అప్పుడే చెప్పలేమని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement