సుల్తాన్ కూడా లీక్ అయ్యిందా..! | Salman Khans Sultan leaked online | Sakshi
Sakshi News home page

సుల్తాన్ కూడా లీక్ అయ్యిందా..!

Jul 6 2016 11:15 AM | Updated on Sep 4 2017 4:16 AM

సుల్తాన్ కూడా లీక్ అయ్యిందా..!

సుల్తాన్ కూడా లీక్ అయ్యిందా..!

బాలీవుడ్ ఇండస్ట్రీకి పైరసీ కారణంగా భారీ నష్టాలు జరుగుతున్నాయి. చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు రిలీజ్కు ముందే ఆన్లైన్లో లీకైపోతున్నాయి.

బాలీవుడ్ ఇండస్ట్రీకి పైరసీ కారణంగా భారీ నష్టాలు జరుగుతున్నాయి. చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు రిలీజ్కు ముందే ఆన్లైన్లో లీకైపోతున్నాయి. ఆఖరికి బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కొత్త సినిమా సుల్తాన్కు కూడా ఈ కష్టాలు తప్పలేదు. ఇటీవల బాలీవుడ్ మోస్ట్ కాంట్రవర్షియల్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఉడ్తా పంజాబ్ రిలీజ్కు ముందే నెట్లో దర్శనమిచ్చింది. ఆ విషయాన్ని మర్చిపోకముందే, వివేక్ ఒబరాయ్, రితేష్ దేశ్ముఖ్ ప్రధాన పాత్రల్లో నటించిన గ్రేట్ గ్రాండ్ మస్తీ కూడా రిలీజ్కు ముందే ఆన్లైన్లో వచ్చేసింది.

తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ సినిమా కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉందన్న టాక్ వినిపిస్తోంది. గతంలో మాదిరిగా అన్ని టోరెంట్ సైట్లలో అందుబాటులో లేకున్నా కొన్ని వెబ్ సైట్స్ నుంచి ఇప్పటికే సుల్తాన్ సినిమాను డౌన్ లోడ్ చేసినట్టుగా చెబుతున్నారు. ఈ విషయాన్ని ముంబై సైబర్ క్రైం ఎక్స్పర్ట్స్ ధృవీకరించారు. ఇప్పటికే నష్ట నివారణా చర్యలు చేపట్టిన చిత్ర యూనిట్ పలు వెబ్ సైట్స్ బ్లాక్ చేయిస్తున్నప్పటికీ.. ఇప్పటికే జరగాల్సిన నష్టం  జరిగిపోయిందంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement