'మెగా' హీరోకు బిగ్ హిట్ | Sai Dharam Tej's 'Supreme' joins Rs.20 crore club | Sakshi
Sakshi News home page

'మెగా' హీరోకు బిగ్ హిట్

May 31 2016 12:51 PM | Updated on Sep 2 2018 5:43 PM

'మెగా' హీరోకు బిగ్ హిట్ - Sakshi

'మెగా' హీరోకు బిగ్ హిట్

సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం 'సుప్రీం' బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.

చెన్నై: 'మెగా' ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం 'సుప్రీం' బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. అతడి కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రూ. 20 కోట్ల క్లబ్ లో చేరిందని ట్రేడ్ ఎనలిస్ట్ త్రినాథ్ తెలిపారు. మాస్ ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఆకట్టుకుంటోందని, డిఫెరెంట్ గా తెరకెక్కించిన క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ప్రతి ఒక్కరినీ అలరిస్తున్నాయని ఆయన చెప్పారు.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాయి ధరమ్ తేజకు ఇది మూడో హిట్. అతడు హీరోగా అంతకుముందు నటించిన పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలు విజయం సాధించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement