ఫిబ్రవరిలో మెగా వార్ | Sai Dharam Tej Movie Clash with Varun Tej | Sakshi
Sakshi News home page

Jan 3 2018 11:51 AM | Updated on Jan 3 2018 12:43 PM

Sai Dharam Tej Movie Clash with Varun Tej - Sakshi

టాలీవుడ్ లో సినిమాల నిర్మాణం భారీగా పెరుగతోంది. దీంతో హీరోల మధ్య పోటి తప్పటం లేదు. అయితే ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు మాత్రం తమ సినిమాల మధ్య క్లాష్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఒక్కోసారి ఒకే ఫ్యామిలీ హీరోలకు మధ్య కూడా పోటి తప్పటం లేదు. ఫిబ్రవరిలో ఇలాంటి ఆసక్తికరమైన పోటి ఒకటి జరగనుంది.

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం తొలిప్రేమ, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే అదే రోజు వినాయక్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాను కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. అదే జరిగితే ఇద్దరు మెగా హీరోలు ఒకే రోజు బరిలో నిలుస్తారు. మరి మెగా హీరోలు పోటికి సై అంటారో లేక.. ఎవరో ఒకరు సర్థుకు పోతారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement