దొంగా.. దొంగా

sahoo movie shooting in hyderabad - Sakshi

‘బాహుబలి’ సినిమాలో ఊళ్ల మీద పడి దోచేసుకునే దొంగలను తన ఎత్తులతో పనిపడతాడు అమరేంద్ర బాహుబలి. ఆ పాత్రలో ప్రభాస్‌ కటౌట్‌ సూపర్‌. ఇప్పుడీ కటౌట్‌ దొంగగా కనిపిస్తే.. కచ్చితంగా మంచి దొంగే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ దొంగ లోకల్‌ దొంగ కాదు ఇంటర్నేషనల్‌ దొంగ అట. ఒక దేశం నుంచి ఇంకో దేశాన్ని చిటికెలో దాటేస్తాడట. ఇంటర్‌ పోల్‌ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేస్తాడట. అసలు విషయం ఏంటంటే.. ‘సాహో’ సినిమాలో ప్రభాస్‌  పురాతన వజ్రాలు దొంగిలించే క్రేజీ దొంగ పాత్రలో కనిపించనున్నారని సమాచారం.

‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సాహో’. యువీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ కథానాయిక. ప్రభాస్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకునే సీరియస్‌ పోలీస్‌ ఆఫీసర్‌ రోల్‌లో శ్రద్ధ కనిపించనున్నారు. మరి ఈ దొంగా పోలీస్‌ ఆట ఎలా ఉంటుందో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, అరుణ్‌ విజయ్‌ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి కెమెరా: మది, సంగీతం:శంకర్‌ ఎహాసన్‌ లాయ్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top