సీక్వెల్‌కి 15 ఏళ్లు పట్టింది

Saamy 2 Trailer Launch Event - Sakshi

విక్రమ్‌

‘‘తెలుగులో నేను చేస్తున్న కొత్త ప్రయత్నం ‘సామి’ చిత్రం. కమర్షియల్, ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ‘సామి’తో నాకు పెద్ద హిట్‌ ఇచ్చి, నన్ను కమర్షియల్‌ హీరోగా నిలబెట్టాడు హరి. ఎప్పటి నుంచో ‘సామి’ చిత్రానికి సీక్వెల్‌ చేయాలనుకున్నా... 15 ఏళ్లు పట్టింది. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే కనిపించాల్సి వచ్చింది. అందుకు కెమెరామెన్‌ వెంకటేశ్‌ కష్టపడ్డారు’’ అని హీరో విక్రమ్‌ అన్నారు. విక్రమ్‌ హీరోగా, Mీ ర్తీ సురేష్, ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్లుగా హరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సామి’. బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్‌ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు.

విక్రమ్‌ మాట్లాడుతూ– ‘‘కీర్తీ సురేష్‌కి ‘మహానటి’ సినిమా ఎంతటి గౌరవాన్ని తెచ్చిపెట్టిందో అందరికీ తెలిసిందే. మా చిత్రంలో ఆమె కామెడీ ట్రాక్‌లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ ఈ సినిమాకు హైలైట్‌. అందరం కష్టపడి సినిమా చేశాం. ప్రేక్షకుల స్పందన కోసం ఎదురు చూస్తున్నా. తెలుగు, తమిళంలో అతి త్వరలో సినిమా రిలీజ్‌ అవుతుంది’’ అన్నారు. ‘‘నేను చేసిన ప్రతి సినిమాను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు హరి. ‘‘విక్రమ్‌గారి సినిమాలను మేం వదల్లేకపోతున్నాం. 4 రోజుల్లో ఆడియో వేడుక నిర్వహించనున్నాం’’ అన్నారు బెల్లం రామకృష్ణా రెడ్డి. నిర్మాత శిబు, ఆర్‌ఆర్‌ సినిమాస్‌ మహేష్, నిర్మాతలు కేవీవీ సత్యనారాయణ, శోభారాణి, బాబీ సింçహా (విలన్‌), దుర్గం గిరీష్, సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top